One Night Stand In Musi River: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు, హామీలను అమలు చేయకుండా రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో 6 గ్యారంటీలు అమలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికల్లో ప్రచారం తప్ప వాస్తవం వేరే అని పేర్కొన్నారు. ప్రజలకు ఏం ఒరిగిందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటోందని పేర్కొన్నారు.
Also Read: Praja Palana: కనీవినీ ఎరుగని రీతిలో రేవంత్ రెడ్డి ఏడాది పాలన విజయోత్సవాలు
హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో శుక్రవారం నిర్వహించిన ఓ సమావేశంలో రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. అతడి ఏడాది పాలనతోపాటు తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మోసాలు.. దుష్ప్రచారంపై మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వాలను స్వర్గసీమ అంటూ రాహుల్ గాంధీ పొగుడుతుంటే రేవంత్ రెడ్డి జబ్బలు చర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
Also Read: Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్, ఆఫీస్‌లకు సెలవు
'సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీ వంటి నాయకులు తెలంగాణలో యాత్రలు చేపట్టి అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏది సరిగ్గా అమలు చేయలేదని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. 'మాటలు ప్రజలకు.. మూటలు కాంగ్రెస్ పార్టీకి అన్న చందంగా రేవంత్ పాలన ఉంది' అని వర్ణించారు. రేవంత్ రెడ్డి వ్యవహారం, దోపిడీ, అబద్ధాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, తెలంగాణ సమాజాన్ని అవమానించేలా ఉందని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిలదీశారు. తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ కోసం ఆందోళన చేస్తున్నారని గుర్తుచేశారు. ధాన్యం కొనుగోలు కోసం ప్రతి నయా పైసా కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం మాత్రం కొనుగోలు చేయడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు.
'రైతు భరోసా పేరుతో రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 ఇస్తామని చెప్పి రూ.15 పైసలు కూడా రాలేదు. రైతుల కూలీలకు రూ.12 వేలు ఇవ్వలేదు' అని కిషన్ రెడ్డి తెలిపారు. 11 నెలలు పూర్తయినా అరకొరగానే రుణమాఫీ చేశారని ఆరోపించారు. తెలంగాణలో శాంతిభద్రతల పర్యవేక్షణలో రేవంత్ రెడ్డి విఫలమయ్యాడని విమర్శించారు. 'సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మాసిటీకి భూసేకరణకు సంబంధించి కలెక్టర్ మీద దాడి, రైతుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించడంతో రేవంత్ రెడ్డి దిగజారాడు' అని మండిపడ్డారు.
'కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల ప్రభుత్వంగా మారింది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలవగా.. వ్యాపార రంగం విశ్వాసం కోల్పోయింది. పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు' అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 'ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూల్చడం.. నల్లగొండలో రైతులను రెచ్చగొట్టారు తప్పితే చేసిందేమీ లేదు' అని వివరించారు. తమకు పదవులు ముఖ్యం కాదని.. మూసీ ప్రక్షాళన చేయండని సూచించారు.
మూసీ పరిసర ప్రాంతంలో ఒక్కరోజు నిద్రపోండి అని రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. రేపు మూసీ పరివాహక ప్రాంతాల్లో నిద్ర చేయబోతున్నట్లు తెలిపారు. మూడు నెలల పాటు నిద్ర చేయడానికి కూడా మేము సిద్ధమని స్పష్టం చేశారు. ప్రజలతోనే.. వారి ఇంట్లోనే భోజనం చేసి పేదల ఇళ్లల్లోనే నిద్ర చేస్తామని వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter