CM Revanth reddy VS KCR: కేసీఆర్‌ను తెలంగాణ ఎప్పుడో మర్చిపోయింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్.. అసలేం జరిగిందంటే..?

CM Revanth reddy fires on kcr: సీఎం రేవంత్ రెడ్డి గులాబీ బాస్ పై రెచ్చిపోయారు. ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయాలు రచ్చగా మారాయని తెలుస్తొంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Nov 11, 2024, 04:02 PM IST
  • కేసీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన రేవంత్..
  • నిరుద్యోగుల్ని మోసం చేసిందని సెటైర్ లు..
CM Revanth reddy VS KCR: కేసీఆర్‌ను తెలంగాణ ఎప్పుడో మర్చిపోయింది..  సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్.. అసలేం జరిగిందంటే..?

cm revanth reddy fires on kcr: తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ల మధ్య వార్ గట్టిగానే నడుస్తొందని తెలుస్తొంది. ఈ నేపథ్యంలో.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తన బర్త్ డే వేడుకల నేపథ్యంలో.. మాజీ సీఎం కేసీఆర్ ను , బీఆర్ఎస్ పాలనను ఎండగట్టారు. ఈ క్రమంలో.. గులాబీ బాస్ కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పాలన గురించి ప్రజలకు తెలిసిపోయిందని 420 హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. వచ్చేది మన ప్రభుత్వమే అని కేసీఆర్ జోస్యం చెప్పారు. అంతేకాకుండా.. పది నెలల కాలంలో ప్రజలు ఏం కోల్పోయారో తెలుసొచ్చిందన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి తాజాగా, గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది.

ఖైరతాబాద్ లో ఏఎంవీఐ లో పోస్టులు సాధించిన అభ్యర్థులకుస సీఎం రేవంత్ నియామక పత్రాలు అందజేశారు.ఈ క్రమంలో.. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. పది నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్ధమైందని ఒకాయన మాట్లాడుతుండని విమర్శించారు. కేసీఆర్ పై సెటైర్ లు వేస్తే.. మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేమిలేదని ఎద్దేవా చేశారు. ఈ పది నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారని, రైతులు రైతు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారని స్పష్టం చేశారు.

అదే విధంగా.. 1 కోటి 5 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్ది పొందారని చెప్పుకొచ్చారు. పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించామన్నారు. అంతే కాకుండా.. 49 లక్షల 90వేల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారు. రూ.500లకే మా ఆడబిడ్డలు వంటగ్యాస్ సిలిండర్ అందుకోగలుగుతున్నరని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10లక్షల వరకు ఉచిత వైద్యంతో పాటు, 21వేల మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారన్నారు. అంతే కాకుండా.. 35వేల మంది టీచర్ల బదిలీలు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని మాట్లాడారు. కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం, ప్రగతి భవన్ లను కట్టుకున్నాడని, తెలంగాణలో ఒక్క రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదని చెప్పారు.

కాంగ్రెస్ సర్కారు రాగానే..  100 నియోజక వర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 గ్రూప్ 1 ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించామని, వీరికి తొందరలోనే నియామకపత్రాలు అందిస్తామన్నారు. అదే విధంగా..  వారిని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తామని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ లేకపోయిన ప్రజలకు బాధలేదని, తెలంగాణ సమాజంలో కేసీఆర్ ను ఎప్పుడొమర్చిపోయిందన్నారు.

బడి దొంగలను చూసాం కానీ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఉన్న విచిత్ర పరిస్థితి  తెలంగాణలో చూస్తున్నామని రేవంత్ సెటైర్ లు వేశాడు. ఇప్పటికైన బీఆర్ఎస్ మారాలని, ప్రభుత్వం చేసే పనులకు మద్దతు ఇవ్వాలని, లోపాలు ఉంటే సలహాలు తీసుకుంటామని కూడా తెల్చిచెప్పారు.

Read more: KTR VS CM Revanth Reddy: రేవంత్ ఒక చిచోరా సీఎం.. మళ్లీ రెచ్చిపోయిన కేటీఆర్..ఏమన్నారంటే..?

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్.. గతంలో గ్రూప్ 1 ఎగ్జామ్ లను నిర్వహించకుండా.. బీఆర్ఎస్ నిరుద్యోగుల్ని మోసం చేసిందన్నారు. తమ సర్కారు పది నెలల్లో 50వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని చెప్పారు. అంతే కాకుండా.. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన బుకాయిస్తున్నారని సెటైర్ లు వేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News