Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు జులూం.. రంగంలోకి దిగిన హరీష్ రావు, కేటీఆర్.. ఏమన్నారంటే..?

KTR Vs Revanth Reddy: హుజురాబాద్ లో దళిత బంధు పథకం రానివారంత ధరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన నియోజక వర్గంలోని వారికి దళిత బంధు స్కీమ్  కోసం నిధులు విడుదల చేయాలని నిరసలను తెలిపారు. దీంతో ఇది కాస్త ఉద్రిక్తంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Nov 9, 2024, 05:35 PM IST
  • పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసుల దాడి..
  • ఖండించిన కేటీఆర్..
Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు జులూం.. రంగంలోకి దిగిన హరీష్ రావు, కేటీఆర్.. ఏమన్నారంటే..?

ktr and harish rao fires on cm revanth reddy: తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య వార్ పీక్స్ కు వెళ్లిందని చెప్పుకొవచ్చు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా..ప్రస్తుతం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన నియోజక వర్గంలో.. దళిత బంధుపథకం రెండో విడత నిధుల్ని విడుదల చేయాలని ధర్నాకు దిగారు. ఇప్పటి వరకు రోజులు గడుస్తున్న దళిత బంధు పథకం విడుదల చేయట్లేదని అన్నారు . దీంతో రోడ్డెక్కి మరీ పాడి కౌశిక్ రెడ్డి నిరసన తెలిపారు.

ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. అంతే కాకుండా.. పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. మళ్లీ సొంత పూచీ కత్తుపై విడిచిపెట్టినట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా.. పోలీసులు తనపై జులుం ప్రదర్శించారని, తనను సీఎం రేవంత్ చంపేందుకు చూస్తున్నాడని కూడా.. పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో.. ప్రస్తుతం దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ స్పందించారు. పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసుల జులుంను ఖండిచారు. ప్రతి దానికి రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని, పోలీసులు అతిగా ప్రవర్తించొద్దని బీఆర్ఎస్ నేతలు గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది.  

హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై పోలీసులు అమానుషంగా దాడి చేయటంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణరహితంగా దాడి చేస్తారా?.. అంటూ ఫైర్ అయ్యారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం.. అంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయటం చేతగానీ దద్దమ్మ రేవంత్ సర్కార్ అని.. అదే విధంగా..ఏదైన అడిగిన వారిపై దాడులు చేసే సంస్కృతికి తెరలేపిందని కౌంటర్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి అంటే ఈ సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని,  ప్రభుత్వాన్ని ఎప్పటికప్పడు నిలదీస్తున్న కౌశిక్ రెడ్డి పై రేవంత్ రెడ్డి కక్ష పెంచుకున్నాడన్నారు.  

మొన్న ఈ మధ్యనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే గాంధీ తో గుండాగిరి చేయించి కౌశిక్ రెడ్డిపై దాడి చేసే ప్రయత్నం చేశాడని,  వెనక్కి తగ్గకుండా ప్రజల కోసం పోరాటం చేస్తున్న కౌశిక్ రెడ్డి పై ఈసారి పోలీసుల ద్వారానే రేవంత్ రెడ్డి దాడి చేయించాడనికేటీఆర్ అన్నారు. ప్రశ్నిస్తే భయపడి దాడులకు పాల్పడే ఇంత పిరికి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని,   కౌశిక్ రెడ్డి పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

Read more: CM Revanth Reddy: మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి హావా.. సంచలన ప్రెస్ మీట్.. ఏమన్నారంటే..?

అదే విధంగా.. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఫైర్ అయ్యారు. రేవంత్  తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ సైనికులెవరు భయపడాని కేటీఆర్ అన్నారు. కౌశిక్ రెడ్డి పై దాడి చేసిన పోలీసులపై.. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని,  అదే విధంగా పోలీసులు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News