Vijay Devarakonda: షూటింగ్‌లో గాయపడ్డ విజయ్ దేవరకొండ.. నేషనల్ క్రష్ ఎమోషనల్.. హెల్త్ అప్ డేట్ ఏంటంటే..?

Vijay devarakonda Rashmika: విజయ్ దేవర కొండ తాజాగా, ఒక సినిమా షూటింగ్ లో భాగంగా గాయపడ్డారని తెలుస్తొంది. దీంతో రౌడీ స్టార్ అభిమానులతో పాటు విజయ్ లవర్ రష్మీక కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు  తెలుస్తోంది.

1 /6

రౌడీ స్టార్ విజయ దేవర కొండ తాజాగా, వీడీ 12 మూవీ కోసం  యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ చేస్తుండగా.. విజయ్ ఒక్కసారిగా గాయాలపాలయ్యారు. 

2 /6

దీంతో ఆయనను మూవీ టీమ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విజయ దేవర కొండకు బాడీలో అంతర్గతంగా గాయలైనట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం విజయ్ దేవర కొండకు ఫిజియోథెరపీ అవసమని వైద్యులు చెప్పినట్లు తెలుస్తొంది. మరోవైపు విజయ్ దేవర కొండ కొన్నిరోజులుగా సరైన హిట్ మూవీ లేక  తీవ్ర ఒత్తిడికి గురౌతున్నారని వార్తలు వస్తున్నాయి.

3 /6

గీతగోవిందం సినిమా తర్వాత విజయ్ ఆ రేంజ్ హిట్ అందుకోలేక పోయాడు. లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు ప్రేక్షకులను అంతరగా ఆకట్టుకోలేకపోయాయని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం విజయ్ దేవర కొండ..  జెర్సీ మూవీ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. 

4 /6

ఈ సినిమా వచ్చే ఏడాది  ఏడాది మార్చి 28న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయ్ దేవర కొండ యాక్సిడెంట్ కు గురైన సంఘటన తెలియగానే నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎమోషనల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.  

5 /6

ఆగ మేఘాల మీద విజయ్ కు ఫోన్ కాల్ చేసి హెల్త్ అప్ డేట్ గురించి ఆరా తీసిందంట విజయ్ ను కలిసేందుకు వెళ్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. విజయ్ అభిమానులు సైతం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది.

6 /6

ప్రస్తుతం విజయ్ దేవర కొండ గాయం నేపథ్యంలో మాత్రం.. ఆయన కొన్నిరోజులు రెస్ట్ తీసుకొవాలని వైద్యులు చెప్పినట్లు తెలుస్తొంది. కానీ ఆయన మాత్రం తన మూవీకి బ్రేక్ అవసరం లేకుండా.. తొందరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అయిపోతున్నట్లు తెలుస్తొంది.