Nagma marriage: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్.. హీరోలు అందరి సరసన నటించి తనకంటూ మంచి పేరు సొంతం చేసుకున్న హీరోయిన్ నగ్మా.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాలుగు పదుల వయసు దాటి 5 పదుల వయసుకు దగ్గరగా ఉన్న ఈ హీరోయిన్.. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతోందట.
గతంలో సౌరవ్ గంగూలీ, శరత్ కుమార్ తో పాటూ పలువురు స్టార్ హీరోలతో ప్రేమాయణం నడిపిన ఈమె పెళ్ళి వరకు వెళ్లకుండానే విడిపోయింది.
అప్పటినుంచి ఒంటరిగా ఉంటున్న ఈమె.. ఇప్పుడు ఈమె వయసు 49 సంవత్సరాలు. అయితే ఈ వయసులో ఒక బాలీవుడ్ నటుడితో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
త్వరలోనే ఆ బాలీవుడ్ నటుడిని వివాహం చేసుకోబోతోంది అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. 49 ఏళ్ల వయసులో తోడు కావాలని కోరుకుంటుంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు కోడైకూస్తున్నాయి.
ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.. కానీ ప్రస్తుతం నగ్మాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
నగ్మా టాలీవుడ్ , కోలీవుడ్ , బాలీవుడ్ ఇండస్ట్రీలలోనే కాదు భోజ్ పురిలో కూడా నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
కాగా చివరిగా.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అల్లరి రాముడు సినిమాలో కనిపించింది నగ్మా. ఆ తరువాత ఎటువంటి తెలుగు సినిమాలో నటించలేదు. ఈ క్రమంలో ఇప్పుడు నిజంగా ఏమి పెళ్లి చేసుకుంటే మాత్రం.. ఆ ఫోటోలు తెగ వైరల్ అవ్వడం ఖాయంలా కనిపిస్తోంది.