America Elections 2024 in November: అమెరికా ఎన్నికలు ఈరోజు నవంబర్ 5వ తేదీ మంగళవారం నిర్వహించనున్నారు. రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ బరిలోకి దిగగా.. డెమోక్రాటిక్ పార్టీ నుంచి కమలా హ్యారీస్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వారు 2025 జనవరి 20వ తేదీనా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ప్రతిసారి అమెరికా ఎన్నికలు నవంబర్ మొదటి మంగళవార నిర్వహిస్తారు. దీనికి అసలు కారణం తెలుసా?
అమెరికా ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. రిపబ్లికన్ పార్టీ నుంచి డోనాల్డ్ ట్రంప్ పోటీ చేయగా.. డెమోక్రాటిక్ పార్టీ నుంచి కమలా హ్యారీస్ నిలబడ్డారు. అయితే, ఈరోజే ఓటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే, జనవరిలో వీరి గెలిచిన వారి ప్రమాణ స్వీకారం ఉంటుంది.
ఇదిలా ఉండగా ప్రతిసారి నవంబర్‌నెల మంగళవారం రోజు ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇలా కేవలం నవంబర్ మంగళవారం మాత్రమే నిర్వహించడానికి ప్రధాన కారణం ఉంది.
పూర్వం ఎన్నికలు జరిగే సమయం నుంచి ఈ సంప్రదాయం మొదలైంది. పూర్వకాలంలో రైతులు ఓటు వేయడానికి వారికి చాలా సమయం పట్టేది. ఇది వారికి పంటలు చేతికి వచ్చే సమయం.అంతేకాదు ఆ సమయంలో ఓట్లు నవంబర్ డిసెంబర్ నెలలో జరిగేవి.
అయితే, ఒక్కో ప్రదేశంలో ఒక్కో సమయం నెలరోజులు ఎన్నికలు జరిగేవి. అయితే, ఎన్నికల్లో అభ్యర్థిని ఎన్నుకోవడానికి కాస్త కష్టతరం అయ్యేది. దీనివల్ల మొదట ఎన్నికలు జరిగిన ప్రదేశంలో సరైన అభ్యర్థి, ఫలితాలు వచ్చేవి. అప్పటి నుంచి నవంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించేవారు.
కేవలం నవంబర్ మొదటి మంగళవారం నిర్వహించడానికి మరో కారణం. రైతులు ప్రయాణం చేసి ఓటు వేయడానికి రావాలంటే ఎక్కువ సమయం పట్టేది. కాబట్టి ఆదివారం చర్చీకి వెళ్తారు. సోమవారం బయలు దేరితే మంగళవారం చేరుకునేవారు. ఇక బుధవారం ఆ సమయంలో మార్కెట్ ఉండేది.అందుకే అప్పటి నుంచి అమెరికా ఎన్నికలు నవంబర్ మొదటి మంగళవారం నిర్వహించడం ప్రారంభమైంది.