IPL Mega Auction 2025 Date And Time Almost Fix:: ప్లేయర్ల రిటెన్షన్ పూర్తవడంతో మెగా వేలానికి ఐపీఎల్ నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఉత్కంఠగా సాగే ఐపీఎల్ వేలం పాట ఎక్కడ నిర్వహిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే తేదీ, ఎక్కడ నిర్వహించాలనేది ఫిక్సయినట్లు చర్చ జరుగుతోంది.
సమయం ఆసన్నం: క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో సీజన్‌కు సమయం ముంచుకొస్తోంది. కొన్ని వారాల పాటు ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తే ఈ టోర్నీపై ప్రజల్లో భారీ స్పందన ఉంది.
ముహూర్తం ఖరారు: ఐపీఎల్ జట్లు అంటిపెట్టుకుంటున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేయడంతో తదుపరి మెగా వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. వేలానికి వేదిక, తేదీ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈసారి ఎక్కడా?: గతేడాది దుబాయ్ వేదికగా వేలం పాట నిర్వహించగా.. ఈసారి ఎక్కడ అనేది ఉత్కంఠగా మారింది. మరోసారి విదేశాల్లోనే ఈ వేలం సాగనున్నట్లు సమాచారం.
అక్కడే వేలం: నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఆస్ట్రేలియాలో ఈ మెగా వేలం నిర్వహించేందుకు నిర్వాహకులు యోచిస్తున్నట్లు సమాచారం.
అప్పుడే: ఈనెల 24, 25వ తేదీల్లో మెగా వేలం నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా ఆస్ట్రేలియా సమయవేళలకు ఇబ్బంది లేకుండా వేలం ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉంది.
అదృష్టం ఎవరిదో: రిటైన్షన్లో భారత స్టార్ ప్లేయర్లను వదిలేయడంతో ఈసారి మెగా వేలం ఆసక్తికరంగా సాగనుంది. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయర్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, మహ్మద్ సిరాజ్ తదితర ఆటగాళ్లు వేలంలో అదృష్టం పరీక్షించుకోనున్నారు.
ప్రత్యక్షప్రసారం: ఎప్పుడు వేలం జరిగినా డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో మెగా వేలం ప్రత్యక్ష ప్రసారం నిర్వహించనున్నారు. వేలం ప్రక్రియ ముగిసిన వెంటనే ఐపీఎల్ షెడ్యూల్ కూడా ఖరారు చేసే అవకాశం ఉంది.