Vijasai Reddy Comments: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో జమిలి ఎన్నికల చర్చ నడుస్తున్న తరుణంలో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏపీలో 2027లోనే ఎన్నికలు రానున్నాయని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.
ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి అత్యంత ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి సహా పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి చాలా కృషి చేశారని విజయసాయి రెడ్జి తెలిపారు. రానున్న ఎన్నికల్లో 14 స్థానాలకు 14 స్థానాలు గెలిచేలా భూమన కరుణాకర్ రెడ్డి కృషి చేస్తారన్నారు. 2027లోనే మళ్లీ ఏపీకు ఎన్నికలు రానున్నాయని.. ఈ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధిస్తుందన్నారు. మరోవైపు ట్వీట్ కూడా చేశారు. ముందుగా పోరాటం చేయాల్సింది బానిసత్వం నుంచి విముక్తి కోసమని, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది శకుని అని చెప్పారు. వైఎస్ జగన్ మరోసారి అధికారంలో వచ్చి ఆయన ఆశీస్సులతో కేంద్రంలో మంత్రయితే చట్ట సవరణ ద్వారా కార్మికులు, కూలీలను లాభాల్లో భాగస్వామ్యుల్ని చేస్తానని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
1/2: నా ప్రియమైన జెండా కూలీల్లారా. మీలో నేనొకడ్ని. మనం ముందుగా పోరాటం చేయాల్సింది బానిసత్వం నుంచి విముక్తి కోసం...ఎందుకంటే లాభాల్లో వాటా మన కూలీలకు ఇవ్వరుగా..??!
కూలీలకు కూలీ మాత్రమే గిడుతుంది. ఎంత కొట్టుకున్న ఉపయోగం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అన్న కాదు, శకుని.2/2:… pic.twitter.com/yZiUyaGX9z
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 3, 2024
వైఎస్ జగన్ ఎన్నో చారిత్రాత్మక కార్యక్రమాలు చేశారని, ఇవాళ ప్రజలకు సంక్షేమం దూరమైందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సిక్స్ ప్యాక్ హామీలిచ్చి చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారన్నారు. చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఆఖరికి దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకున్నారన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 4 పోర్టుల్ని నిర్మిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
2027లో దేశంలో జమిలి ఎన్నికలు రానున్నాయని, జగన్ మరోసారి ముఖ్యమంత్రి కానున్నారని వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అటు విజయసాయి రెడ్డి కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రానున్న ప్రభుత్వంలో కేంద్రమంత్రి అయ్యే అవకాశాల గురించి మాట్లాడారు.
Also read: 8th Pay Commission: ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్, 8వ వేతన సంఘంతో ఉద్యోగుల జీతభత్యాలు ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.