Not a big fan of the house : తన తండ్రిని దూరం చేసిన 10 జనపథ్ ఇల్లు అంటే ఇష్టం లేదని కుండబద్దలు కొట్టిన రాహుల్ గాంధీ.. మేనల్లుడితో రాహుల్ వీడియో వైరల్

Not a big fan of the house : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం దీపావళి వీడియోను షేర్  చేశారు. ఈ వీడియోలో తన మేనల్లుడితో మాట్లాడుతూ పలు విషయాలను షేర్ చేసుకున్నారు. 10 జనపథ్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడే మా నాన్న చనిపోయాడు..కాబట్టి నాకు ఈ ఇల్లు అంటే ఇష్టం లేదని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

Written by - Bhoomi | Last Updated : Nov 1, 2024, 06:14 PM IST
Not a big fan of the house : తన తండ్రిని దూరం చేసిన 10 జనపథ్ ఇల్లు అంటే ఇష్టం లేదని కుండబద్దలు కొట్టిన రాహుల్ గాంధీ.. మేనల్లుడితో రాహుల్  వీడియో వైరల్

Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీపావళి సందర్భంగా తన మేనల్లుడితో మాట్లాడుతున్న వీడియోను రాహుల్ గాంధీ షేర్ చేశారు. ఈ వీడియోలు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని లుటియన్స్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ నివాసం 10 జనపథ్ తనకు ఇష్టం లేదని..తన తండ్రి రాజీవ్ గాంధీ ఈ నివాసంలో ఉన్నప్పుడే మరణించారంటూ గత జ్నాపకాలను షేర్ చేసుకున్నారు. తన మేనల్లుడు రెహాన్ రాజీవ్ వాద్రా పలు విషయాల గురించి చెప్పారు. దీపావళి సందర్భంగా పెయింటర్లతో తన నివాసానికి పెయింటింగ్ వేయించడం..వారితో కలిసి ముచ్చటించారు. వారి ఆర్థిక స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. 

10 జనపథ్ గురించి రాహుల్ ఏం మాట్లాడారంటే :

మే 21, 1991న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్ లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేశారు. అప్పట్లో రాజీవ్ గాంధీ అధికారిక నివాసం 10 జనపథ్ లో ఉండేవారు. అప్పటి నుంచి సోనియా గాంధీ కూడా ఆ నివాసంలోనే ఉన్నారు. అయితే గతేడాది కోర్టు తీర్పుతో లోకసభ సభ్యత్వం కోల్పోయిన రాహుల్ గాంధీ తుగ్లక్ లేన్ నివాసాన్ని ఖాళీ చేసి తన తల్లి వద్దే ఉంటున్నారు. ఈ సందర్భంగా 10 జనపథ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Also Read: Home loan: కొత్త ఇల్లు కొంటున్నారా..అయితే హోంలోన్ తీసుకునే వారికి ఈ బ్యాంకుల్లో బంపర్ ఆఫర్

రాహుల్ గాంధీ పెయింటర్లు, కుమ్మరుల కుటుంబ పరిస్థితుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్లో పోస్టు చేస్తూ ప్రత్యేక వ్యక్తులతో గుర్తుండిపోయే దీపావళి అని క్యాప్షన్ ఇచ్చారు. దీపావళి అంటే వెలుగు, పేదరికం, నిస్సహాయత అనే చీకటిని పారద్రోలగలదని, దీని జ్యోతి ప్రతి ఇంటిని ప్రకాశిస్తుందని  ఆయన అన్నారు. ప్రతి ఒక్కరి దీపావళిని సంతోషంగా జరుపుకోవడానికి - నైపుణ్యానికి హక్కులు, సహకారంపై గౌరవం ఇచ్చే వ్యవస్థను మనం సృష్టించాలి.''ఈ దీపావళి అందరి జీవితాల్లో శ్రేయస్సు, పురోగతి, ప్రేమను తెస్తుందని నేను ఆశిస్తున్నాను అని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: Diwali Muhurat Trading: నేడే ముహూరత్ ట్రేడింగ్.. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి..? దివాలి మార్కెట్ సెంటిమెంట్ ఇదే

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News