Gold Rates Today: దీపావళి రోజు పసిడి ప్రియుల గుండెల్లో లక్ష్మీ బాంబులా పేలిన బంగారం ధర.. తొలిసారి రూ. 82,000 దాటిన పసిడి

Today Gold Rate: దీపావళి సందర్భంగా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత రెండు మూడు రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు నేడు భారీగా పెరిగాయి. 

Written by - Bhoomi | Last Updated : Oct 31, 2024, 02:07 PM IST
Gold Rates Today: దీపావళి రోజు పసిడి ప్రియుల గుండెల్లో లక్ష్మీ బాంబులా పేలిన బంగారం ధర.. తొలిసారి రూ. 82,000 దాటిన పసిడి

Today Gold Rate: బంగారం ధరలు దీపావళి రోజున కూడా టపాసులు పేలినట్టు పేలుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోల్చితే ఒక్క రోజులోనే రూ. 330 పెరిగింది. ఇక అక్టోబర్ 31 గురువారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 81890 పలుకుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 81560గా పలికింది. 

పసిడి ధరలు భారీగా పెరగడానికి ప్రధానంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలను అసలు కారణంగా చెబుతున్నారు అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో ఈ సంవత్సరం చాలా ఉత్కంఠతో జరుగుతున్నాయి. ట్రంప్, కమలహరిస్ మధ్యలో జరుగుతున్న హోరాహోరీ పోరులో, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు అనే దానిపైన సర్వత్ర ఉత్కంఠత నెలకొని ఉంది. 

అయితే జాతీయ సర్వేల్లో ఇప్పటికీ కమలా హారిస్ ఇప్పటికే ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ట్రంప్ కూడా అదే స్థాయిలో కొద్ది శాతం దూరంలో మాత్రమే ఉన్నారు. దీంతో స్వింగ్ స్టేట్ ఇప్పుడు కీలకం కానున్నాయి. దీంతో ఈసారి అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠతతో వెళ్తున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కూడా ఊగిసలాడుతున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు సేఫ్ గా భావించే బంగారం వైపు పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 

అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వస్తే బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలకు ఊపు లభిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ కు మద్దతుగా నిలుస్తున్న ప్రపంచ కుబేరుడు ఇలాన్ మాస్క్ సైతం తన పెట్టుబడులను ఎక్కువగా క్రిప్టో కరెన్సీలపైనే ఇన్వెస్ట్ చేస్తున్నాడు. గతంలో టెస్లా కార్లను కునేందుకు సైతం క్రిప్టో కరెన్సీని అనుమతిస్తున్నట్లు ఇలాన్ మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Also Read: Diwali 2024: దీపావళి లక్ష్మీపూజకు సమయమిదే.. ఈ ముహూర్తంలో పూజ చేస్తే మీ ఇంట సిరి సంపదలే..!  

క్రిప్టో కరెన్సీ వైపు అమెరికా ఆర్థిక విధానం కీలక నిర్ణయం తీసుకుంటే సాంప్రదాయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు అనేవి. దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. దీంతో ఇన్వెస్టర్లు తమ సేఫ్ మార్కెట్ కోసం బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు ఎక్కువగా మగ్గుచూపుతున్నారు. . దీనికి తోడు చైనా పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. ఇది కూడా బంగారం ధరలు పెరగడానికి దోహదం చేస్తుంది. 

ఇదిలా ఉంటే బంగారం ధరలు 2025 సంవత్సరంలో 1 లక్ష రూపాయలు దాటడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. బంగారం ధరలు ఇలా ఆకాశమే హద్దుగా పెరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ మీరు ఆభరణాలు కొనుగోలు చేసినట్లయితే కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా బంగారం బరువు విషయంలోనూ నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితులను రాజీ పడవద్దు అని సూచిస్తున్నారు.

Also Read:Fact Check:  కస్టమ్స్ డిపార్ట్ మెంట్ నుంచి ఫోన్ అంటూ మీకు కాల్ వచ్చిందా..? అయితే జాగ్రత్త..కేంద్ర ప్రభుత్వం ఏం హెచ్చరించందంటే..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News