Ramphal Fruit Benefits: సీతాఫలం అందరూ తిని ఉంటారు. కానీ ఎప్పుడైనా రామఫలం తిన్నారా? నిజానికి సీతాఫలంలో కంటే ఎక్కువ పోషకాలు రామఫలంలో ఉంటాయి. రామఫలం క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని తినడం వల్ల అన్ని రకాల పొట్ట సమస్యలు దూరమవుతాయి. అలాగే తీవ్ర గుండె సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా శరీరానికి కలిగే ఇతర ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణ వ్యవస్థకు మేలు:
రామఫలంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. తరచుగా పొట్ట సమస్యలతో బాధపడుతున్నవారు మలబద్ధకం సమస్య తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో పాటు దీర్ఘకాలిక పొట్ట సమస్యలు రాకుండా ఉంటాయి.
గుండె సమస్యలకు:
రామఫలంలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు గుండె సంబంధిత వ్యాధులను నివారించడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే గుండెపోటు రాకుండా కూడా రక్షిస్తుంది.
క్యాన్సర్ నివారణకు..:
రామఫలంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల క్యాన్సర్లను నివారించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ కణాలను కూడా సులభంగా తగ్గిస్తుంది.
చర్మ ఆరోగ్యానికి:
రామఫలంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసిపోయేలా సహాయపడుతుంది.. దీంతో పాటు ముడతలు పడకుండా కూడా శరీరాన్ని కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
కళ్ల సమస్యలు, మధుమేహానికి చెక్:
రామఫలంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని పెంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే శరీర బరువును కూడా నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర పరిమాణాలను కూడా తగ్గిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.