New Pension Rule: పెన్షనర్లకు దీపావళి గిఫ్ట్, ఇక ప్రతి నెలా అదనపు పెన్షన్, కొత్త నిబంధనలివే

New Pension Rule: పెన్షనర్లకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు అదనపు పెన్షన్ ఇవ్వనుంది. ఇకపై 80 ఏళ్లు దాటినవారికి అదనంగా పెన్షన్ లభించనుంది. ఈ మేరకు పెన్షన్ నిబంధనలు మారాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 28, 2024, 12:05 PM IST
New Pension Rule: పెన్షనర్లకు దీపావళి గిఫ్ట్, ఇక ప్రతి నెలా అదనపు పెన్షన్, కొత్త నిబంధనలివే

New Pension Rule: కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా పెన్షన్ సంబంధిత ఆదేశాలు జారీ అయ్యాయ. ఈ ఆదేశాలు ప్రకారం పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా 80 ఏళ్లు దాటితే కంపాషనేట్ అలవెన్స్ రూపంలో అదనపు పెన్షన్ లభించనుంది. ఈ మేరకు పెన్షన్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 

పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందిస్తోంది. ఇక నుంచి 80 ఏళ్లు దాటిన పెన్షనర్లకు అదనపు పెన్షన్ దక్కనుంది. సాధారణంగా రిటైర్మెంట్ తరువాత పెన్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్ అందించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొత్తగా కంపాషనేట్ అలవెన్స్ అందనుంది. కేంద్ర మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం 80 ఏళ్లు దాటితే ప్రభుత్వం నుంచి అదనపు పెన్షన్ పొందవచ్చు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయి. ఇప్పుడు అందుతున్న పెన్షన్‌తో పాటు కంపాషనేట్ పెన్షన్ లభిస్తుంది. బేసిక్ పెన్షన్ నుంచి 20 శాతం అదనంగా లభిస్తుంది. ఇది 80-85 ఏళ్ల వయస్సు కలిగినవారికి. అదే 85 నుంచి 90 ఏళ్ల వయస్సు కలిగినవారికి 30 శాతం పెన్షన్ అదనంగా పొందవచ్చు. అదే 90-95 ఏళ్లుంటే 40 శాతం అదనపు పెన్షన్ పొందవచ్చు. ఇక 95-100 ఏళ్లుంటే 50 శాతం పెన్షన్, 100 ఏళ్లు దాటితే 100 శాతం పెన్షన్ లభిస్తుంది. 

81 ఏళ్ల వ్యక్తి 5000 రూపాయలు పెన్షన్ పొందుతుంటే అతనికి అదనంగా 1000 రూపాయలు పెన్షన్ లభిస్తుంది. అదే వ్యక్తి 85 నుంచి 90 ఏళ్ల మధ్యలో ఉంటే 1500 రూపాయలు అదనపు పెన్షన్ ఉంటుంది.పెన్షనర్ నిర్ణీత వయస్సును దాటినప్పుడు అదనపు పెన్షన్ ఆ నెల మొదటి రోజు నుంచి వర్తిస్తుంది. 

Also read: NO OTP: నవంబర్ 1 నుంచి ఓటీపీ బాధలకు చెక్, ట్రాయ్ కొత్త ఆదేశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News