Chandanagar Incident: ఆదివారం స్నేహితులతో కలిసి చందానగర్‌లోని వీవీప్రైడ్ హోటల్‌కు వెళ్లాడు ఉదయ్. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఇతను ఉద్యోగ రీత్యా అశోక్ నగర్ లో ఉంటున్నాడు. తాజాగా ఉదయ్ హోటల్ మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే ఓ కుక్క ఉదయ్ వెంటపడింది.
దాని నుంచి తప్పించుకునే సమయంలో హోటల్ కిటికీ నుంచి ఉదయ్ కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినా హోటల్ సిబ్బంది బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. విషయం బయటకు పొక్కడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇంతకీ హోటల్ రూంలోకి కుక్క కు ఎవరు అనుమతించారు. అసలు హోటల్ గదిలో వచ్చిన ఎవరో కష్టమర్ కుక్కనా.. లేకపోతే హోటల్ కు సంబంధించిన పెంపుడు కుక్క అనా కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఒకవేళ కుక్కకు ఎవరైనా వెంట తెచ్చుకున్నా.. దాన్ని గొలుసుతో కట్టేయకుండా ఎందుకు విడిచిపెట్టారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఘటన ఇపుడు తీవ్ర కలకలం రేపుతోంది. మరోవైపు తెలంగాణ, ఏపీ అని తేడా లేకుండా అన్ని చోట్ల కుక్కల బెడద ఎక్కువైంది. రీసెంట్ గా ఒక చిన్న పిల్లాడిని కుక్కు పొట్టన పెట్టుకుంది. ఒకప్పుడు వీధి కుక్కలకు ఇంట్లో వాళ్లు ఏదైనా మిగిలిన ఆహారాన్ని పెట్టేవారు. ఇపుడు అపార్ట్ మెంట్ కల్చర్ పెరగడంతో కుక్కలకు సరైన ఆహారం దొరకడం లేదు. దీంతో ఉన్మాదంలా ప్రవర్తించి దొరికన వాళ్లు దొరికనట్టు దాడులకు తెగబడుతున్నాయి. మరి చందానగర్ ఘటనలో పెంపుడు కుక్కలో ఎందుకు ఉన్మాదం మొదలైందనే కోణంలో జంతు ప్రేమికులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter