Shambala: ‘కల్కి’ మూవీకి పోటీగా ‘శంబాల'.. టాలీవుడ్ లో మరో సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్..

Shambala: ప్రస్తుతం తెలుగు సహా ఇతర భాషల్లో సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీలకు మంచి ఆదరణ లభిస్తోంది. అలా మరో ప్రపంచంలో జరిగే కథతో తెరకెక్కిన చిత్రం ‘శంబాల’. ఇప్పటికే కల్కి మూవీలో ‘శంబాల’ నగరం గురించి ప్రస్తావించారు. ఇపుడీ నగరం నేపథ్యంలో తెలుగులో సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 19, 2024, 02:58 PM IST
 Shambala: ‘కల్కి’ మూవీకి పోటీగా ‘శంబాల'.. టాలీవుడ్ లో మరో సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్..

Shambala:  ప్రస్తుతం తెలుగులో  వాస్తవానికి దూరంగా మరో వరల్డ్ లో  జరిగే కథల నేపథ్యంలో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలు  ఆడియన్స్‌ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి ఓ మిస్టిక్ వరల్డ్‌లో రూపొందుతున్న చిత్రమే 'శంబాల'. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను మేకర్స్‌ లాంచ్‌ చేశారు .ఫస్ట్  పోస్టర్‌తోనే గతంలో ఎప్పుడూ ఎక్స్‌పీరియన్స్ చేయని ఓ డిఫరెంట్ వరల్డ్‌లోకి ప్రేక్షకులను  తీసుకువెళ్లబోతున్నామన్న హింట్ ఇచ్చారు.

రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్‌లో ఒక్క మనిషి కూడా లేని గ్రామం.  ప్రళయానికి ముందు భీకరంగా ఉన్న ఆకాశం, మబ్బుల్లో ఓ రాక్షస ముఖం ఇవన్నీ చూస్తుంటే 'శంబాల' కథ లో వెన్నులో వణుకుపుట్టించే థ్రిల్లింగ్ అంశాలు పుష్కలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.  డిసిప్లిన్, డెడికేషన్ కు కేరాఫ్ గా నిలిచిన ఆది సాయికుమార్ ఈసారి జియో సైంటిస్ట్ గా ఛాలెంజింగ్ రోల్ లో యాక్ట్ చేసిన సినిమా ఇది.  తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలతో లక్కీ గర్ల్ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్న ఆనంది ఈ సినిమా లో ఆదీ సరసన కథానాయికగా నటిస్తోంది.  ప్రస్తుతం  షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

'ఏ' యాడ్ ఇన్‌ఫినిటిమ్ అనే డిఫరెంట్ చిత్రంతో డైరెక్టర్ గా మంచి ఫేమ్ సంపాదించుకున్న యుగంధర్ ముని ఈ సినిమాకు డైరెక్ట్ చేస్తున్నాడు. తన ఫస్ట్ మూవీతోనే 'శంబాల'ను కూడా ఓ డిఫరెంట్ వరల్డ్‌లో డిఫరెంట్ టోన్‌లో ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం.  

సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భారతీయ వెండితెరపై ఇంత వరకు ఎవరు  టచ్‌ చేయని డిఫరెంట్ స్టోరీ లైన్‌ను చూపించబోతున్నారట.  అమెరికాలోని న్యూయార్క్‌ ఫిలిం అకాడమీలో ఫిలిం మేకింగ్‌ ట్రైనింగ్‌ తీసుకున్న యుగంధర్‌, 'శంబాల' సినిమాను హాలీవుడ్ స్థాయిలో హై టెక్నికల్‌ స్టాండర్డ్స్‌తో తెరకెక్కిస్తున్నాడు.  గ్రాండ్ విజువల్స్‌తో రూపొందిస్తున్నారు. బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనుకాడకుండా విజువల్స్‌ పరంగా, టెక్నికల్‌ గా  సినిమాను "టాప్‌ క్లాస్‌"అనే రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు రాజశేఖర్‌ అన్నభీమోజు , మహిధర్ రెడ్డి.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

టెక్నికల్ విషయంలో  హాలీవుడ్ రేంజ్‌ టెక్నీషియన్స్‌నే తీసుకున్నారు యుగంధర్.  డ్యూన్, ఇన్సెప్షన్, బ్యాట్ మ్యాన్, డన్ కిర్క్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ అయిన హాన్స్‌ జిమ్మర్‌ లాంటి లెజెండరీ హాలీవుడ్ కంపోజర్స్‌తో కలిసి వర్క్ చేసిన ఇండియన్ మ్యూజీషియన్‌ శ్రీరామ్‌ మద్దూరి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్స్ స్కోర్స్ విషయంలోనూ ఇంతకు ముందు ఏ  సినిమాలో ఎక్స్‌పీరియన్స్ చేయని కొత్త సౌండింగ్‌ను ఈ సినిమాలో  ప్రేక్షకులు చూడబోతున్నరన్న మాట.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News