Real Estate in Hyderabad: కరోనా తరువాత హైదరాబాదులో రియల్ ఎస్టేట్ కు రెక్కలు వచ్చాయి ఒక్కసారిగా పిల్ల ధరలు చుక్కలను తాకడం ప్రారంభించాయి 30, 40 లక్షలకు దొరికిన ఫ్లాట్లు ఇప్పుడు ఒక కోటి రూపాయలు పలుకుతున్నాయి. దీంతో సామాన్యులు మధ్యతరగతి ప్రజలు సొంతింటి కలను హైదరాబాదులో సాకారం చేసుకోవడం ప్రశ్నార్ధకంగా మారుతుంది. ముఖ్యంగా హైదరాబాదులోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి.
తాజాగా రియల్ ఎస్టేట్ డేటా ఎలక్ట్రిక్ సంస్థ ప్రాప్తి విడుదల చేసిన ఒక డేటా ప్రకారం ఇండియా మొత్తంలోని టాప్ టెన్ నగరాల్లో కొత్త హౌసింగ్ ప్రాజెక్టుల ధరలు దాదాపు 88 శాతం పెరిగాయి. గత ఐదు సంవత్సరాల్లోనే ఈ పెరుగుదల కనిపించింది. ఇప్పుడు ఏ నగరంలో ఎంత పెరిగిందో తెలుసుకుందాం. ముఖ్యంగా హైదరాబాదులో చూసినట్లయితే సంవత్సరానికి 16% చొప్పున ఇళ్ల ధరలు పెరిగాయి.
గత ఐదు సంవత్సరాల్లో హైదరాబాదులో 81 శాతం పైగా ఇల్ల ధరలు పెరిగాయి 2019 వ సంవత్సరంలో ఒక్కో చదరపు అడుగు ధర 4686 రూపాయలు మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు దాదాపు 8500 రూపాయలు గరిష్టంగా పలుకుతోంది. అంటే ఒక వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్ కొనుగోలు చేయాలంటే 85 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక ఇంకొంచెం పెద్ద ఫ్లాట్ కొనుగోలు చేయాల్సి వస్తే కోటి రూపాయల పైనే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాదులో ఫ్లాట్ కొనుగోలు చేయాలంటే కనీసం ఒక కోటి రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. హై రైజ్ టవర్లు, డూప్లెక్స్ ఫ్లాట్ల గురించి చెప్పాల్సిన పనిలేదు నగరంలోని గచ్చిబౌలి వంటి ప్రైమ్ లొకేషన్ లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఫ్లాట్ల ధరలు కనీసం ఐదు కోట్ల రూపాయల నుంచి ప్రారంభం అవుతున్నాయి గరిష్టంగా 20 కోట్ల వరకు పలుకుతోందని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు.
ఇక హైదరాబాదు తో పోటీ పడుతూ బెంగుళూరు కూడా గడచిన ఐదు సంవత్సరాలలో దాదాపు 98% వృద్ధి కనిపించింది ఇక్కడ ఒక్కో చదరపు అడుగు ధర 10 వేలు పైకి చేరింది ఇక దేశంలోనే అత్యధికంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని గురుగ్రామ్ నోయిడా వంటి ప్రాంతాల్లో ఇళ్ల ధరలు గడచిన ఐదు సంవత్సరాలలో 160% పెరిగినట్లు రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
కానీ విచిత్రంగా ముంబైలో మాత్రం గడచిన ఐదు సంవత్సరాలలో కేవలం 37% మాత్రమే ఇళ్ల ధరలు పెరిగాయి అయితే ఇక్కడ ఒక్కో చదరపు అడుగు ధర 35 వేల రూపాయలు పైనే ఉంది అంటే ముంబైలో ఇళ్ల ధరలు శాచ్యురేషన్ పాయింట్ వద్దకు చేరుకున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే ముంబై చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ విస్తరిస్తున్న నేపథ్యంలో అక్కడ విపరీతమైన ధరలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: free scooty yojana 2024: మహిళలకు ఫ్రీ స్కూటీ పథకం... మోదీ సర్కార్ బంపర్ ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.