Hyundai IPO: దేశంలో అతిపెద్ద ఐపీవోగా ప్రభుత్వ రంగ జీవిత భీమా సంస్థ ఎల్ఐసీ ఉండేది. అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని ప్రముఖ కార్ల కంపెనీ హ్యుండయ్ ఆక్రమించింది. హ్యుండయ్ పబ్లిక్ ఇష్యూ నిన్న అంటే అక్టోబర్ 15న ఓపెన్ కాగా రేపు అంటే అక్టోబర్ 17న క్లోజ్ కానుంది. దిగ్గజ బ్రాండ్ కావడంతో హ్యుండయ్ ఐపీవోపై భారీ అంచనాలే ఉన్నాయి.
1966లో ఇండియాలో కార్ల వ్యాపారం ప్రారంభించిన హ్యుండయ్ కంపెనీ 13 మోడల్స్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు తొలిసారిగా ఐపీవో ప్రవేశపెట్టింది. దేశంలోని స్టాక్ మార్కెట్లో దాదాపు 20 ఏళ్ల తరువాత వాహన కంపెనీ ఐపీవో రావడం ఇదే. అంతేకాకుండా అతిపెద్ద ఐపీవోగా నిలుస్తోంది. అక్టోబర్ 15న ప్రారంభమైంది. రేపటితో ముగియనుంది. ఇవాళ రెండో రోజు సబ్స్క్రిప్షన్లు కూడా ముగిశాయి. హ్యుండయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ పేరుతో ఈ ఐపీవో అందుబాటులో ఉంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కే షేరుకు 1865 నుంచి 1960 మధ్య ఉంది. షేర్లు కొనే ఆలోచన ఉంటే మినిమం 7 ఈక్విటీ షేర్లు తీసుకోవాలి. అంటే ఒక లాట్‌కు 7 షేర్లుంటాయి. కనీస పెట్టుబడి 13,720 రూపాయలు. ఒక్క ఇన్వెస్టర్ 14 లాట్లు కొనవచ్చు.
హ్యుండయ్ కంపెనీ షేర్లకు అప్లై చేసినవారికి అక్టోబర్ 18న కేటాయింపు ఉంటుంది. అక్టోబర్ 22వ తేదీన అటు బీఎస్ఈ, ఇటు ఎన్ఎస్ఈలో లిస్టింగ్ కానున్నాయి. ప్రస్తుతం అన్ లిస్టెడ్ షేర్లు గ్రే మార్కెట్లో 63 రూపాయల ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి. హ్యుండయ్ షేర్లపై మార్కెట్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఏ మేరకు లాభాలు అందిస్తుందో చూడాలి
Also read: DA Hike News: బ్రేకింగ్ న్యూస్, ఉద్యోగులకు దీపావళి కానుక 3 శాతం డీఏకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.