Rashmika Mandanna: డీప్ ఫేక్ వీడియో.. రష్మికకు కలిసొచ్చిన అదృష్టం..!

Rashmika Mandanna brand ambassador for i4C: రష్మిక డీప్ ఫేక్ వీడియో అప్పట్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిన విషయమే. అయితే ఈ సంఘటన తర్వాత ఇప్పుడు రష్మిక ప్రభుత్వానికి సంబంధించిన ఒక ముఖ్య కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. భారత ప్రభుత్వం.. సైబర్ నేరాల మీద అవగాహన కల్పించేందుకు ఒక వినూత్న కార్యక్రమాన్ని చెయ్యబోతోంది. ఇక ఈ కార్యక్రమంలో రష్మికకు కీలక రోల్ అందించిన ప్రభుత్వ.  పూర్తి వివరాల్లోకి వెళితే..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Oct 15, 2024, 04:35 PM IST
Rashmika Mandanna: డీప్ ఫేక్ వీడియో.. రష్మికకు కలిసొచ్చిన అదృష్టం..!

Rashmika Mandanna I4C: నేషనల్ రష్మిక మందన్న కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ టాలీవుడ్ లో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ , అటు సినిమాలు,  ఇటు బ్రాండ్ ప్రమోటర్ గా కూడా పనిచేస్తూ భారీగానే సంపాదిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ప్రభుత్వంతో కలిసి పనిచేయడం వెనుక ఉన్న అసలు విషయాన్ని తెలియజేసింది రష్మిక. 

భారత ప్రభుత్వం.. సైబర్ నేరాల మీద అవగాహన కల్పించేందుకు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కార్యక్రమానికి రష్మికను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.  డీప్ ఫేక్ వీడియో ద్వారా రష్మిక కూడా ఒక బాధితురాలే అన్న విషయం అందరికీ తెలిసిందే. డీప్ ఫేక్ వీడియోతో ఇప్పుడు రష్మిక నేషనల్ వైడ్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.  ఈ నేపథ్యంలోనే రష్మికను భారత హోం మంత్రిత్వ శాఖ బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ ప్రకటనలు జారీ చేసింది. 

ఈ మేరకు రష్మిక ఒక వీడియోని కూడా పంచుకుంది. నా డీప్ ఫేక్ వీడియోని చాలా వైరల్ చేశారు. ఆ ఫేక్ వీడియో ని క్రియేట్ చేసి ట్రెండ్ చేయడం అదొక సైబర్ నేరం.  ఇప్పుడు ఈ సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నిలబడాలని వీటిపై అవగాహన కల్పించాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పని చేస్తున్న నేపథ్యంలో , ఐ4సీ సంస్థకు నేను బ్రాండ్ అంబాసిడర్ గా  ఎన్నిక అయ్యాను.

సైబర్ నేరగాళ్లు ఎటు నుంచి ఎలా దాడి చేస్తారో చెప్పలేని పరిస్థితి. అందుకే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. మనమందరం కలిసికట్టుగా పోరాడి సైబర్ నేర రహిత భారత్ ను క్రియేట్ చేయాలి అంటూ రష్మిక చెప్పుకొచ్చింది ఇక ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఈ వీడియో చాలా వైరల్ గా మారుతుంది. ఇది చూసిన నెటిజన్స్ రష్మిక డీప్ ఫేక్ వీడియో ఈమెకు ఏకంగా ప్రభుత్వంతో కలిసి పనిచేసే అదృష్టాన్ని కల్పించింది అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

రష్మిక సినిమాల విషయానికొస్తే.. తెలుగులో గర్ల్ ఫ్రెండ్,  పుష్ప 2 అంటూ బిజీగా ఉంది. సౌత్ కంటే నార్త్ పైన ఎక్కువగా ఫోకస్ చేసిన ఈమె.. అక్కడ యానిమల్ తో మంచి ఇమేజ్ అందుకుంది .అంతకుముందు ఈమె చేసిన హిందీ చిత్రాలన్నీ బోల్తా కొట్టినా యానిమల్ తో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ అయిపోయింది. కోలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా మారింది.

 

 
 
 
 
 

Read more: Mutyalamma Temple: ముత్యాలమ్మ విగ్రహాం ధ్వంసం.. రంగంలోకి దిగిన రాజాసింగ్.. సికింద్రాబాద్ లో హైటెన్షన్.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

 

 

Trending News