Harsha Sai Case: హర్ష సాయి కేసులో బాధితురాలి తరుపున రంగంలోకి దిగిన లాయర్ నాగూరు బాబు.. కీలక వ్యాఖ్యలు..

Harsha Sai Case: ఫేమస్ యూట్యూబర్ తనతో నటించిన హీరోయిన్ పై లైంగిక దాడి నేపథ్యంలో బాధితురాలి తరుపున లాయర్ నాగూర్ బాబుతో పాటు నిర్మాత బాలచంద్ర మీడియాతో మాట్లాడారు. అంతేకాదు హర్ష సాయి కేసు గురించి కీలక విషయాలను పంచుకున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 6, 2024, 12:35 PM IST
Harsha Sai Case: హర్ష సాయి కేసులో బాధితురాలి తరుపున రంగంలోకి దిగిన లాయర్ నాగూరు బాబు.. కీలక వ్యాఖ్యలు..

Harsha Sai Case: గత కొన్ని రోజులుగా యూట్యూబర్ హర్ష సాయి మీద వస్తున్న ఆరోపణలను పై బాధితురాలు తరఫున ఉ లాయర్ నాగూర్ బాబు, నిర్మాత  బాలచంద్ర మీడియాతో సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా హర్ష సాయితో పాటు ఆయనకు అండగా నిలబడిన కొంతమంది వ్యక్తులపై పెట్టిన కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు.  ఈ సందర్భంగా  లాయర్ నాగూర్ బాబు గారు మాట్లాడుతూ : ఇప్పటివరకు ఈ కేసు కు సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఎక్కడ చూపించలేదన్నారు.  ఏ కేసు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అనేది ఎవరికీ ఇప్పటికీ  తెలియదన్నారు. రూ. 2 కోట్ల  కోసమని వస్తున్న ప్రచారాల్లో నిజం లేదన్నారు. కానీ ప్రస్తుతం హర్ష సాయి అనే వ్యక్తి దేశం వదిలి పారిపోయాడు. తను ఇక్కడ లేకపోయిన తనకి సపోర్ట్ గా ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని ఇన్ స్టాగ్రామ్ పేజెస్ ని వాడుకుంటూ కేసును తారుమారు చేస్తున్నట్టు తమకు సమాచారం వచ్చిందన్నారు.

బాధితురాలు పైన లేని అభియోగాలను మోపుతూ ఫ్యాబ్రికేటెడ్ రికార్డ్ వాయిస్ తో ఆడియో ఫైల్స్ రిలీజ్ చేస్తున్నారన్నారు. కానీ కొంతమంది మీడియా ఛానల్స్ (జీ మీడియా కాదు) నిజానిజాలు తెలియకుండా బాధితురాలని ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఈ విషయంపై మేము హైకోర్టును ఆశ్రయించామన్నారు. కానీ మీడియా చాలా సపోర్ట్ చేస్తూ అతను బెట్టింగ్ యాప్స్ ద్వారా చేస్తున్న మోసాలను బయటపెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్ ని ఎవరైతే టెలికాస్ట్ చేస్తున్నారు డిలీట్ చేయవలసిందిగా ధర్మాసనం నుంచి ఇంటెరిమ్ ఆర్డర్ తెచ్చుకున్నాము.
అదే విధంగా ఎఫ్ఐఆర్లో ఫైల్ అయిన సమాచారం ఏమిటో తెలియకుండా కొంతమంది వాదనలకు దిగి ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్ తో బాధితురాలని మానసికంగా క్షోభ పెడుతున్నారన్నారు.

ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..

ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!

అలా చేస్తున్న సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ పై కోర్టుల్లో కేసు ఫైల్ చేసామన్నారు. అలా నిజా నిజాలు తెలియకుండా బాధితురాలని ఇబ్బంది పెడుతున్న కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ దాసరి విజ్ఞాన్, శేఖర్ బాషా,  కరాటే కళ్యాణి, మహీధర్ వైబ్స్ పైన కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. సెక్షన్ 356 కింద డిఫర్మేషన్, 72 ఆఫ్ బి ఎన్ ఎస్ కింద కేసులు నమోదు చేసామన్నారు.  బాధితురాలు పేరు ఎక్కడ కూడా నిజనిర్ధారణ జరిగే వరకు తీయకుండా న్యాయస్థానం నుంచి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

నిర్మాత బాలచంద్ర గారు మాట్లాడుతూ..  బాధితురాలు ఎంతో ధైర్యంగా ముందుకు హర్ష సాయి పై  కేసు పెట్టారన్నారు.  ఆ తర్వాత ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్ తో ఎంత మానసిక బాధకి గురి చేస్తున్నారు కూడా చూస్తున్నాం. కేసు పెట్టిన రెండో రోజు నుంచే హర్ష సాయి ఇబ్బంది పెడుతున్నాడన్నాడు. దానికోసం కోర్టును ఆశ్రయించగా మాకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. ఈ వార్తని మీడియాతో పంచుకోవాలని ఈ సమావేశం ఏర్పాటు చేసామన్నారు.  అదేవిధంగా ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్ ని నిజా నిజాలు తెలియకుండా ఎవరు ఎక్కడ చూపించరాదని న్యాయస్థానం ఆర్డర్ పాస్ చేసిందన్నారు.

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News