Dakshina Movie Review: ‘దక్షిణ’ మూవీ రివ్యూ.. సాయి ధన్సిక మూవీ ఎలా ఉందంటే..!

Dakshina Movie Review: రజినీకాంత్ హీరోగా యాక్ట్ చేసిన ‘కబాలి’ మూవీలో ఆయన కూతురుగా సాయి ధన్సిక ప్రేక్షకులకు  చేరువ అయింది. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘దక్షిణ’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 4, 2024, 07:50 PM IST
Dakshina Movie Review: ‘దక్షిణ’ మూవీ రివ్యూ.. సాయి ధన్సిక మూవీ ఎలా ఉందంటే..!

రివ్యూ: దక్షిణ (Dakshina)
నటీనటులు: సాయి ధన్సిక, రిషబ్ బసు,మేఘన చౌదరి, స్నేహ సింగ్, కరుణ,ఆర్నా ములెర్, నవీన్ తదితరులు  
సినిమాటోగ్రఫీ : రామకృష్ణ (ఆర్.కె)
మ్యూజిక్ : బాలాజీ
నిర్మాణ సంస్థ: కల్ట్ కాన్సెప్ట్స్
నిర్మాత : అశోక్ షిండే
రచన - దర్శకత్వం : ఓషో తులసీరామ్.

‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ‘దక్షిణ’.  రిషవ్ బసు మరొక లీడ్ రోల్లో యాక్ట్ చేసాడు.  ఓషో తులసిరామ్ డైరెక్ట్ చేసాడు.  ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..  

కథ విషయానికొస్తే..
దక్షిణ (సాయి ధన్సిక) ఒక సిన్నియర్  పోలీస్ ఆఫీసర్. సిటీలో వరుసగా  అమ్మాయిలను ఎవరో మర్డర్ చేస్తుంటారు. ఒకరి తర్వాత ఒకర్ని కిడ్నాప్ చేసి వాళ్లను అత్యంత పాశవికంగా తల నరికి చంపుతూ ఉంటాడు ఓ సైకో. అసలు ఆ సైకో ఎవరు ? ఎందుకు అతను అమ్మాయిలను ఎందుకు టార్గెట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఏం జరిగింది. ఈ సైకో వల్ల దక్షిణ జీవితంలో కూడా ఓ సంఘటన జరుగుతుంది. మరియు సిన్సియర్ కమ్ సీరియస్ పోలీస్ ఆఫీసర్ ఆ సైకోను పట్టుకోవడంలో సక్సెస్ అయిందా.. ? ఈ క్రమంలో ఏం జరిగిందనేదే ‘దక్షిణ‘ సినిమా స్టోరీ.

కథనం, విశ్లేషణ:

తెలుగు సహా దక్షిణాది భాషల్లో ఇలాంటి సైకో థ్రిల్లర్ ఎన్నో వచ్చాయి. దర్శకుడు ఓషో తులసీరామ్ అమ్మాయిల హత్యల చుట్టూ ఈ కథను అల్లుకున్నాడు. కథ కొత్తది కాకపోయినా.. దాన్ని పిక్చరైజ్ చేసిన విధానంగా ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమాలో ఫస్ట్ సీన్ తోనే దర్శకుడు ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేసాడు. కొన్ని సన్నివేశాలు సిల్లీగా అనిపిస్తుంటాయి. కానీ పకడ్బందీ స్క్రీన్ ప్లేతో అవి పెద్దగా కనిపించవు.
ఒక ఏసీపీ పై ఒక సైకో కిల్లర్ ఈజీగా లైంగిక దాడి ఎలా చేయగలడు ?, సినిమా మొత్తం ఈ పాయింట్ చుట్టే తిరిగింది.  ఆడియన్స్ ను తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్సుకత పెంచడంలో సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్ బ్యాంక్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. ఊహించని మలుపులు ఆకట్టుకుంటాయి.  ఇక సెకండాఫ్ ని డైరెక్టర్  డీల్ చేసిన విధానం బాగుంది. దర్శకుడు ఓషో తులసీరామ్ దర్శకుడిగా మంచి భవిష్యత్తు ఉంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ అలరిస్తుంది. ఈ దక్షిణ సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ ఇంట్రెస్టింగ్ గా  ఉన్నాయి.

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

 నటీనటుల విషయానికొస్తే..

‘దక్షిణ’ మూవీలో టైటిల్ రోల్లో నటించిన ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక తన బాడీ లాంగ్వేజ్ తో అలరించింది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రకు సరిగ్గా సెట్ అయింది.  కొన్ని ఎమోషనల్, క్రైమ్ సన్నివేశాల్లో మంచిన నటన కనబరిచింది.  కొన్ని కీలక సన్నివేశాల్లో తన నటనతో సినిమాను నిలబెట్టిందే చెప్పాలి. మరో లీడ్ రోల్లో యాక్ట్ చేసిన  నటించిన రిషవ్ బసు కూడా చాలా బాగా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రిషవ్ బసు నటన ఆకట్టుకుంటుంది.  సీరియస్ క్రైమ్ సన్నివేశాల్లోని అతని యాక్టింగ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు ఆకట్టుకున్నారు.
పంచ్ లైన్.. దక్షిణ..ఆకట్టుకునే సైకో థ్రిల్లర్

రేటింగ్: 2.75/5

ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!

ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..

Trending News