తూర్పు గోదావరి: భారత రాజ్యాంగ నిర్మాత డా బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన జిల్లాలోని గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఉప్పలపాడులో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారినప్పటికీ.. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని ఘటనాస్థలానికి చేరుకోవడంతో పరిస్థితి వెంటనే అదుపులోకి వచ్చింది.
గండేపల్లి ఎస్సై తిరుపతిరావు, జగ్గంపేట సిఐ వై.రాంబాబులు సంఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించారు. ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాన్ని, ఆ చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించిన పెద్దాపురం డిఎస్పి అరిటాకులు శ్రీనివాస్.. వెంటనే విచారణ చేపట్టి, విగ్రహాన్ని ధ్వంసం చేసినవారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.