Himanta biswa: మమతా నీకేంత ధైర్యం.. మమ్మల్ని బెదిరిస్తావా..?.. ఎక్స్ లో రెచ్చిపోయిన సీఎం హిమంత బిశ్వశర్మ..

Kolkata doctor murder case: వెస్ట్ బెంగాల్ లో.. బీజేపీ పిలుపునిచ్చిన బంద్ కాస్త రణరంగంగా మారింది. దీనిపై ప్రస్తుతం తీవ్రదుమారం చెలరేగుతుంది.ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త వివాదానికి దారి తీసిందని చెప్పుకొవచ్చు.  

Written by - Inamdar Paresh | Last Updated : Aug 28, 2024, 09:56 PM IST
  • కోల్ కతా వివాదంలో మరో కీలక పరిణామం..
  • మోదీపై నోరుపారేసుకున్న దీదీ..
Himanta biswa: మమతా నీకేంత ధైర్యం.. మమ్మల్ని బెదిరిస్తావా..?.. ఎక్స్ లో రెచ్చిపోయిన సీఎం హిమంత బిశ్వశర్మ..

Assam cm himanta biswa sarma fires on mamata Banerjee: కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యచారం ఘటన దేశంలో పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై అన్ని వర్గాల ప్రజలు తమ నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికి కూడా అనేక చోట్ల నిరసనలు మిన్నంటాయి. ఏకంగా సుప్రీంకోర్టు సైతం.. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఈ క్రమంలో మంగళవారం విద్యార్థులు చేపట్టిన నిరసనలు కాస్త వివాదాస్పదంగా మారాయి. విద్యార్థులపై పోలీసులు ఎక్కడికక్కడ అణచివేసే ప్రయత్నాలు చేశారు.

 

అంతేకాకుండా.. హుబ్లీ ఫ్లైఓవర్ మీద టియర్ గ్యాస్ లు, భాష్ఫవాయువు గోళాలతో నిరసనలు తెలియజేస్తున్న వారిపై దాడులకు తెగ బడ్డారు. ఈ క్రమంలో పోలీసుల తీరును నిరసిస్తూ.. బీజేపీ ఈరోజు బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బంద్ కాస్త పూర్తిగా హింసాత్మకంగా మారింది. అనేక చోట్ల దుండగులు బీజేపీ నేతల్ని టార్గెట్ చేసుకుని మరీ కాల్పులకు తెగబడ్డారు. పలు చోట్ల పోలీసులు కూడా శాంతియుతంగా నిరసలు తెలియజేస్తున్నవారిపై లాఠీలను ఝుళిపించారు. ఈ నేపథ్యంలో మమతా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో రాజకీయంగా తీవ్ర దుమారంగా మారాయి. 

పూర్తి వివరాలు..

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కోల్ కతా ఘటనతో బెంగాల్ ప్రస్తుతం అట్టుడికిపోతుంది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దేశంలో కొత్త వివాదానికి తెరలేపాయని చెప్పవచ్చు. మమతా బెనర్జీ తృణమూల్ విద్యార్థి విభాగం స్థాపించిన రోజును పురస్కరించుకుని ఒక కార్యక్రమంలో  మాట్లాడుతూ.. కోల్‌కతా ట్రైనీ డాక్టర్  అత్యాచారం, హత్య ఘటనపై బెంగాల్‌లో శాంతి భద్రతలు అదుపుతప్పేలా కొంత మంది అల్లరి మూకల్ని ఉసిగొల్పుతున్నారని మమతా .. బీజేపీ, పీఎం మోదీపై మండిపడ్డారు.

బెంగాల్‌లో అల్లర్లు చెలరేగితే.. అవి ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తాయని మమతా అన్నారు.  'బెంగాల్ తగులబడితే, అసోం, ఈశాన్యం, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖాండ్, ఒడిశా, ఢిల్లీ కూడా తగలబడతాయని మమతా అన్నారు. తాము ఈ ఘటనలను చూస్తు ఉరుకోమని, మీ కుర్చీని కూడా పడగొడతామంటూ మమత ఫైర్ అయ్యారు.ఈ  ఘటనతో ఒక్కసారిగా చిచ్చు చెలరేగింది. దీనిపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఘాటుగా స్పందించారు.

ఎక్స్ వేదికగా దీదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  అసోంను బెదరించడానికి మీకెంత ధైర్యం అంటూ సామాజిక మాధ్యమం వేదికంగా ఫైర్ అయ్యారు. అంతేకాకుండా.. మా మీద కళ్లు ఎర్ర చేసే సాహాసం చేయోద్దని చురకలు పెట్టారు. మీ రాజకీయ వైఫల్యాలకు ఇండియాను తగులపెట్టే ప్రయత్నం కూడా చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని  విభజన చేసే విధంగా మాట్లాడటం సరికాదని  హిమంత్ బిస్వా శర్మ ఎక్స్ లో ట్వీట్ చేశారు.

Read more: Puja Khedkar: యూపీఎస్సీకి బిగ్ ట్విస్ట్.. కోర్టులో సంచలన వ్యాఖ్యలు చేసిన పూజా ఖేడ్కర్.. అసలేం జరిగిందంటే..?

మరోవైపు..బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షురాలు సుకాంత ముజుందార్ మమతా వివాదస్పద వ్యాఖ్యలపై.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. దీదీ.. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.  ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి.. దేశ వ్యతిరేకుల మాదిరిగా మాట్లాడటంపై..మజుందార్ తన లేఖలో ప్రస్తావించారు. ఈ ఘటనతో మమతా బెనర్జీ కి సీఎం పదవీపై ఉండే అర్హత లేదని  వెంటనే ఆమె రాజీనామా చేయాలని కూడా పిలుపునిచ్చారు. మమతా వ్యాఖ్యలపై.. అస్సాం జలవనరుల శాఖ మంత్రి పిజూష్ హజారికా  కూడా మండిపడ్డారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News