Cholesterol Myths: కొలెస్ట్రాల్ విషయంలో చాలామంది చాలా రకాలుగా చెబుతుంటారు. ఇందులో అన్ని వాస్తవాలు ఉండకపోవచ్చు. కొన్ని అవాస్తవాలు కూడా ప్రచారంలో ఉంటాయి. అందుకే ఏవి నిజమో ఏది కాదో తెలుసుకోగలగాలి. చెడు కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. కొలెస్ట్రాల్ సమస్య ఉంటే ఆయిల్ ఫుడ్స్, జంగ్ ఫుడ్స్, స్వీట్స్ మానేయాల్సి ఉంటుంది.
కొలెస్ట్రాల్ అరికట్టకుంటే హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, హైపర్ టెన్షన్, డయాబెటిస్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెస్సెల్ వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. కొన్ని సార్లు మరణానికి కూడా దారితీస్తుంది. అదే సమయంలో కొలెస్ట్రాల్‌కు సంబంధించి కొన్ని అవాస్తవాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందా.
కొలెస్ట్రాల్ విషయంలో చాలామందికి తప్పుడు సమాచారం ఉటుంది. ప్రతి వ్యక్తి శరీరం పనితీరు, కొలెస్ట్రాల్ లెవెల్స్ వేర్వేరుగా ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటే కొలెస్ట్రాల్ డిమాండ్ ఇతరులో పోలిస్తే అధికంగా ఉంటుంది. జీన్స్ పరంగా డయాబెటిస్ సోకిన వ్యక్తి తక్కువ కొలెస్ట్రాల్ ఉండే పదార్ధాలు తీసుకోవాలి. ఏ విధమైన అనారోగ్య సమస్య లేని వ్యక్తి అయితే కొలెస్ట్రాల్ కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు. కొలెస్ట్రాల్ సమాన స్థాయిలో ఉండే వ్యక్తుల్లో రక్తపోటు వేర్వేరుగా ఉంటుంది. అంటే అందరి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఒకేలా ఉండవు.
కొలెస్ట్రాల్ అనేది ఆహారంలో ఓ భాగం. ఇది అవసరం కూడా. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. కణజాలం నిర్మాణంలో కొలెస్ట్రాల్ ఉపయోగుపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ గుండె వ్యాధులు కారణమైనా తగిన మోతాదులో మాత్రం ఉండాల్సిందే. దానికోసమే బ్యాలెన్స్ డైట్ ఉండాలంటారు. శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఎల్డీఎల్, హెచ్‌డీఎల్. ఎల్డీఎల్ తక్కువగా ఉండాలి. హెచ్‌డీఎల్ ఎక్కువగా ఉండాలి. లో డెన్సిటీ లిపోప్రోటీన్ గుండెకు నష్టం కల్గిస్తుంది.
మీ శరీరం ఫిట్ అండ్ హెల్తీగా ఉంటే హై కొలెస్ట్రాల్ ఫుడ్స్ తినవచ్చు. హై కొలెస్ట్రాల్ ఫుడ్ తినడం మంచిది కాదనేది తప్పుడు అభిప్రాయం. ఇది అందరికీ వర్తించదు. కొందరు తినవచ్చు. అయితే మోతాదుకు మించి ఉండకూడదు. పరిమితి దాటితే రక్త వాహికల్లో పేరుకుని రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. పరిస్థితి విషమించవచ్చు. హార్ట్ డిసీజ్, స్ట్రోక్ ముప్పుకు కారణం కావచ్చు.
Also read: Fatty Liver Drinks: రోజూ ఉదయం ఈ 6 డ్రింక్స్ తాగితే ఫ్యాటీ లివర్ సమస్య మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook