Sapota Benefits: ప్రతి రోజు సపోటా పండ్లను తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే విటమిన్ A, C అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ పండ్లు ప్రతి సీజన్లో సులభంగా మార్కెట్లో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి బోలెడు పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో లభించే యాంటీఆక్సిడెంట్స్ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. దీంతో పాటు ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని తగ్గించేందుకు కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సపోటాల్లో ఇవే కాకుండా ఇతర విటమిన్స్ కూడా లభిస్తాయి. వీటిని ప్రతి రోజు తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
సపోటాల్లో లభించే పోషకాలు:
విటమిన్లు: సపోటా విటమిన్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇందులో ముఖ్యంగా విటమిన్ A, Cతో పాటు E లభిస్తాయి.
విటమిన్ A రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఇది మానసిక దృష్టిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా చర్మం ఆరోగ్యాన్ని పెంచేందుకు కూడా సహాయపడుతుంది.
విటమిన్ C ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో పాటు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
విటమిన్ E అత్యంత శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పరిగణిస్తారు. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మెదడు పనితీరును పెంచుతుంది.
ఖనిజాలు:
సపోటాలో పొటాషియం, ఐరన్, కాల్షియంతో పాటు మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన ఖనిజాలు లభిస్తాయి.
పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి కీలక పాత్ర పోషిస్తుంది.
ఐరన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెంచేందుకు కూడా సహాయపడుతుంది. దీంతో పాటు శరీరం అంతటా ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి కీలక పాత్రమ పోషిస్తుంది.
కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది.
మెగ్నీషియం కండరాలు, నరాల పనితీరును నియంత్రించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఫైబర్:
సపోటాలో ఫైబర్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా చేసేందుకు, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
ఆరోగ్య ప్రయోజనాలు:
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
సపోటాలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
క్యాన్సర్‌తో పోరాడుతుంది:
సపోటాలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ఇవి క్యాన్సర్ కణాల ఏర్పాటుకు దారితీస్తాయి. దీని కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయి.
కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది:
సపోటాలోని విటమిన్ A కంటి చూపును మెరుగుపరుస్తుంది. దీంతో పాటు రే చికటి సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
సపోటాలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడానికి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. పొట్ట సమస్యలు రాకుండా రక్షిస్తుంది.
ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది:
సపోటాలోని కాల్షియం, మెగ్నీషియం ఎముకల సాంద్రతను పెంచడానికి, ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి