Venus Transit July 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత పొందిన కొన్ని గ్రహాల్లో శుక్ర గ్రహం ఒకటి. ఈ గ్రహాన్ని ఆనందం, సంపదతో పాటు వైభవం, సంపద, ఐశ్వర్యానికి సూచికగా భావిస్తారు. జ్యోతిష్యం ప్రకారం ఈ గ్రహం ఎవరి జాతకంలోనైతే శుభ స్థానంలో ఉంటుందో వారికి జీవితంలో ఆనందంతో పాటు సంపదకు ఎలాంటి లోటు ఉండదు. ఈ గ్రహం ఒక రాశిలోకి సంచారం చేసినప్పుడు దాదాపు 45 నుంచి 50 రోజుల పాటు ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ శుక్ర గ్రహం జూలై 7వ తేదిన చంద్రుడు సొంత రాశి అయిన కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ చంద్రుడి రాశిలో జూలై 31వ తేది వరకు ఉండబోతోంది. ఆ తర్వాత సింహ రాశిలోకి సంచారం చేయబోతోంది. ఆగస్టు 25వ తేది వరకు ఈ సంచార దశలో ఉంటుంది. ఆ తర్వాత ఇతర రాశిలోకి ప్రవేశిస్తుంది. అయితే శుక్రుడు సంచారం చేయడం కారణంగా కొన్ని రాశువారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మేషం, వృషభం:
జూలైలో శుక్రుడు సంచారం చేయడం వల్ల మేషం, వృషభ రాశులవారికి చాలా బాగుంటుంది. ఈ సమయంలో ఎప్పుడు పొందలేని ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన జీవితంలో కూడా సులభంగా విజయాలు సాధిస్తారు. ఈ రాశులవారు ఆర్థికంగా కూడా చాలా లాభపడతారు. వీరు ఈ సమయంలో అనుకున్న పనులు కూడా ఎంతో సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా శుభవార్తలు కూడా వింటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఎలాంటి రంగాల్లో పనులు చేసిన ఫలితాలు తప్పకుండా పొందుతారు. దీంతో పాటు వాహన సౌకర్యం కూడా పెరుగుతుంది.
కన్యారాశి, తులారాశి:
శుక్ర సంచార ప్రభావంతో జూలై నెలలో కన్యారాశి, తులారాశి వారు విపరీతమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా తీసుకున్న అప్పులు కూడా తిరిగి వస్తాయి. దీంతో పాటు కొన్ని సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అలాగే సంపదలో కూడా అనేక మార్పులు వస్తాయి. దీంతో పాటు పూర్వీకుల ఆస్తులు నుంచి కూడా లభిస్తాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
కర్కాటకం, సింహరాశి:
శుక్రుడు సంచారం చేయడం వల్ల జూలై నెలలో కర్కాటక, సింహరాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేతకాకుండా ఈ రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే అనుకున్న పనులు కూడా ఎంతో సులభంగా జరిగిపోతాయి. అంతేకాకుండా ఆఫీసుల్లో అనుకున్న పనులు వెంటనే జరిగిపోతాయి. అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. దీంతో పాటు వీరికి ఆదాయం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి