Soaked Coriander Benefits: ధనియాలు మన వంటింటి కిచెన్ లో ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి. వీటితో అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా ఎంతో మంచివి. కొన్ని ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతాయి. ధనియాలని మార్కెట్లో విస్తృతంగా దొరుకుతాయి. తక్కువ రేట్ లోనే అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ధనియాలు నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎలాంటి రోగాలు ధనియాల నీటితో నయం అవుతాయో తెలుసుకుందాం.
ఇమ్యూనిటీ బూస్టర్..
ధనియాలు నానబెట్టిన నీటిని ప్రతిరోజు ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మీ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్ కి వ్యతిరేకంగా పోరాడుతాయి. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. ధనియాలు సీజనల్ వ్యాధులు రాకుండా జలుబు ,దగ్గు నుంచి కాపాడుతాయి .కోవిడ్ 19 వంటి వ్యాధులకు సైతం ధనియాలను వినియోగించిన సందర్భాలు ఉన్నాయి.
బలమైన జుట్టు..
ధనియాల్లో ముఖ్యంగా విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ మన శరీర ఆరోగ్యానికి, జుట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ధనియాలు జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తాయి. ధనియాల నానబెట్టిన నీటిని ప్రతి రోజు ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య తగ్గిపోతుంది. ధనియాలతో మనం హెయిర్ మాస్క్ కూడా చేసుకొని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
ఇదీ చదవండి: రాగి పిండి రోటీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం.. రక్తంలో చక్కెరస్థాయిలు హఠాత్తుగా పెరగవు..!
బరువు తగ్గుతారు..
ధనియాల నీటిని తీసుకోవటం వల్ల జీవనక్రియ మెరుగవుతుంది. ఇది జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. ధనియాలను గత ఎన్నో ఏళ్లుగా మెడిసిన్లో ఉపయోగిస్తున్నారు. ఈ ధాన్యాలు నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు మాయం అవుతాయి. మెటబాలిజం రేటు బూస్ట్ అవుతుంది. అంతేకాదు ఇలా తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు.
షుగర్ కంట్రోల్..
తరచూ ధనియాల నీటిని మీ డైట్లో చేర్చుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. డయాబెటిస్ తో బాధపడేవారు బ్లడ్ షుగర్ లెవెల్స్, నిత్యం చెక్ చేసుకుంటూ ధాన్యాల వాటర్ ని తీసుకుంటే మంచిది.
ఇదీ చదవండి: ఈ 7 మార్నింగ్ ఆహారాలతో యూరిక్ యాసిడ్, గౌట్, కిడ్నీ సమస్యలు కూడా మాయం..
కిడ్నీ సమస్యలు..
ధన్యాలను నీటిలో నానబెట్టి తీసుకోవటం వల్ల కిడ్నీ సమస్యలు కూడా చెక్ పెడుతుంది. ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఉన్నవారు ధనియాల నీటిని ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఇది డిహైడ్రేషన్ కి కూడా గురికాకుండా చూసుకుంటుంది అంతేకాదు మన శరీరంలో ఉండే టాక్సిన్స్ ను బయటకు పారదోలుతుంది గ్యాస్టిక్ సమస్యలకు చెక్ పెడుతుంది.
పిగ్మెంటేషన్..
ఐరన్ పుష్కలంగా ఉండే ధనియాల్లో ఫంగస్ కి వ్యతిరేకంగా పోరాడుతాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి ఈ నీటిని తీసుకోవడం వల్ల ముఖంపై యాక్నేకు కూడా చెక్ పెడుతుంది. దీంతో ముఖం మృదువుగా మారిపోతుంది. ధనియాలను నానపెట్టడానికి ముందుగా ఒక కప్పులో నీళ్లు తీసుకుని అందులో ధనియాలు వేసి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టుకొని తీసుకోవాలి. మిగిలిన ధనియాల గింజలను మనం వంటల్లో కూడా తిరిగి వాడవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి