OTT Movies: ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

OTT Movies: ఇటీవలి కాలంలో ఓటీటీలకు క్రేజ్ పెరిగింది. అందుకే దాదాపు అన్ని సినిమాలు థియేటర్‌లో విడుదలైన కొద్దిరోజులకు ఓటీటీలో తప్పకుండా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం మరికొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 22, 2024, 02:17 PM IST
OTT Movies: ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

OTT Movies: నచ్చిన భాషలో, నచ్చిన కంటెంట్, నచ్చిన సమయంలో చూసే వీలుండటంతో ఓటీటీలకు ఆధరణ పెరుగుతోంది. ప్రతివారం ఉన్నట్టే ఈ వారం కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లో ఓటీటీల్లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈసారి చెప్పుకోదగ్గ స్టారర్ సినిమాలు లేవు. తమిళ హీరో విశాల్, తెలుగు నటుడు నారా రోహిత్ సినిమాలు తప్పించి మరేవీ లేవు.

నెట్‌ఫ్లిక్స్‌లో..

ఏప్రిల్ 23న ఇటాలియన్ వెబ్‌సిరీస్ బ్రిగంటి, జర్మన్ వెబ్‌సిరీస్ ఫైట్ ఫర్ ప్యారడైజ్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక ఏప్రిల్ 24వ తేదీన స్వీడిష్ వెబ్‌సిరీస్ డెలివరీ మి, ఏప్రిల్ 25న జపనీస్ సినిమా సిటీ హంటర్, ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ డెడ్ బాయ్ డిటెక్టివ్స్, విడుదల కానున్నాయి. ఇక ఏప్రిల్ 26వ తేదీన తెలుగు సినిమా టిల్లు స్క్వేర్, కొరియన్ సిరీస్ గుడ్ బాయ్ ఎర్త్, స్పానిస్ వెబ్‌సిరీస్ ద అసుంత కేస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. 

అమెజాన్ ప్రైమ్‌లో..

ఏప్రిల్ 25వ తేదీన హిందీ వెబ్‌సిరీస్ దిల్ దోస్త్ డైలమా స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. 

జియో సినిమాలో...

ఏప్రిల్ 22వ తేదీన ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ ద జింక్స్ పార్ట్ 2, ఏప్రిల్ 27న వి ఆర్ హియర్ సీజన్ 4 స్ట్రీమింగ్ కానున్నాయి. 

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో..

ఏప్రిల్ 25వ తేదీన తెలుగు సినిమా భీమా, ఏప్రిల్ 26న ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ థ్యాంక్యూ, గుడ్ నైట్, ఏప్రిల్ 26న హిందీ సినిమా క్రాక్ స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. 

Also read: Aaradhya Devi: సోషల్ మీడియాలో ఆరాధ్య దేవి అందాల అరాచకం.. ఇలా అయితే తట్టుకోలేమంటున్న కుర్రాళ్లు..

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News