Lok Sabha Election 2024 - B Form : అసలు 'బీ' ఫారం అంటే ఏమిటి.. ? ఎన్నికల్లో అవి ఎందుకంత కీలకం.. ?

Lok Sabha Election 2024 - B Form: ఎన్నికల సమయంలో తరుచుగా వినిపించే పదం బీ ఫారం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు దాదాపు అన్ని పార్టీలు బీ - ఫారమ్ ఇస్తుంటాయి. అసలు ఈ బీ - ఫారమ్ అంటే ఏమిటన్నదో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 19, 2024, 06:35 AM IST
Lok Sabha Election 2024 - B Form : అసలు 'బీ' ఫారం అంటే ఏమిటి.. ? ఎన్నికల్లో అవి ఎందుకంత కీలకం.. ?

Lok Sabha Election 2024 - B Form: లోక్ సభ  లేదా శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీ అభ్యర్ధులు తమ అధినాయత్వం ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తేనే ఎన్నికల కమిషనర్ ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 543 స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగున్నాయి. దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కను వినియోగించుకోనున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ప్రజలున్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరిగే ఈ ఎన్నికలపై ప్రపంచ వ్యాప్తంగా అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్బంగా నేడు దేశ వ్యాప్తంగా 102 స్థానాలకు ఎన్నికల జరుగుతున్నాయి.  ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో  నామినేషన్ల ప్రక్రియ పూర్తైయింది. మిగిలిన ప్రాంతాల్లో ఈ నామినేషన్ల ఘట్టం కొనసాగుతోంది. ఈ క్రమంలో 'బీ ఫారం' అనే మాటను తరుచుగా వింటూ వస్తున్నాము. అసలు ఈ బీ ఫారమ్ అంటే ఏమిటనే విషయాన్ని పరిశీలిస్తే.. ఏదైనా రాజకీయ పార్టీ తరుపు పోటీ చేస్తున్నారా లేక స్వతంత్ర అభ్యర్ధిగా పోలీ చేస్తున్నారా ? అనే దానిపై అభ్యర్ధులు తమ నామినేషన్ పత్రాల్లో వివరిస్తారు. ఇందు కోసం పొలిటికల్ పార్టీలు ఒక ఫారాన్ని అభ్యర్ధులకు అందిస్తారు. దాన్నే ఎన్నికల పరిభాషలో 'బీ ఫారం' అంటారు. దీన్ని బట్టి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి ఏ పార్టీ తరుపున పోటీ చేస్తున్నారనేది తెలుస్తోంది.

ముఖ్యంగా పార్టీలు తమ పార్టీ తరుపున ఎంపిక చేసే అభ్యర్ధికి ఇచ్చేదే 'బీ' ఫారం. ఫారం అందించే వ్యక్తి ఇచ్చేదే 'ఏ' ఫారం. పార్టీ ఎవరిని సెలెక్ట్ చేసి 'ఏ' ఫారం అందిస్తుందో అతినికి లేదా ఆమెకు మాత్రమే పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్ధులకు 'బీ' ఫారం అందించే అధికారం ఉంటుంది.
ఏ ఫారమ్ అందుకున్న పార్టీ ప్రతినిధి ముందుగా తనకు వచ్చిన 'ఏ' ఫారాన్ని ఆయా ఎలక్షన్ అధికారులకు అందజేస్తారు. అందులో తమ పార్టీ తరుపున పోటీ చేసే క్యాండిడేట్స్ లిస్ట్‌ను తెలియజేస్తారు. ఈ ఫారమ్ లేదా ఆయా పార్టీల పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్.. లేదా ఆ పార్టికి చెందిన ప్రధాన కార్యదర్శి సంతకం ఉంటుంది. అలాగే పార్టీ ముద్ర కూడా ఉండాలి.

'బీ' ఫారం.. (B - Forum)
 
బీ ఫారమ్ విషయానికొస్తే.. గుర్తింపు పొందిన నేషనల్ మరియు రీజనల్ పొలిటికల్ లీడర్లు ఎలక్షన్స్‌లో పోటీ చేసే తమ అభ్యర్ధులు వీరే అంటూ పార్టీ అధికా ప్రతినిధి ఇచ్చేదే 'బీ'  ఫారం. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎలక్షన్ అధికారులకు అభ్యర్ధులు తమ పార్టీ ఇచ్చిన బీ ఫారాన్ని అందజేస్తేనే ఎన్నికల సంఘం ఆ పార్టికి సంబంధించిన గుర్తును కేటాయిస్తారు. ఆయా పార్టీలకు చెందిన అధ్యక్షులు లేదా ప్రత్యేక ప్రతినిధులు ఈ ఫారాన్ని పోటీ చేసే అభ్యర్ధులకు అందజేస్తారు. బీ ఫారం ఉంటే పార్టీ అధికారికంగా బరిలో ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు.
బీ ఫారం వల్ల గుర్తింపు పొందిన పార్టీ అయితే ఆ పార్టీకి చెందిన సింబల్ గుర్తు మీద ఆయా అభ్యర్ధులు పోటీ చేయవచ్చు. ఎన్నికల ప్రచారంలో ఈ గుర్తును వాడుకోవచ్చు.

ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్ధికి బీ - ఫారమ్ అందజేసిన తర్వాత మరో క్యాండిడేట్‌కు ఈ బీ ఫారం అందించడం కుదరదు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు అసలు అభ్యర్ధితో పాటు మరో అభ్యర్ధితో కూడా నామినేషన్ వేయిస్తుంటారు. ఇలాంటి వారిని డమ్మీ క్యాండిడేట్స్ అంటారు.
నిజానికి వీరిద్దరూ ఒకే పార్టికి చెందినవారు. ఒకవేల పోటీ చేసే ప్రధాన అభ్యర్ధి నామినేషన్ తిరస్కరణకు గురైతే.. వెంటనే ప్రత్యామ్నాయంగా బీ ఫారం సమర్పించిన వ్యక్తి బీ ఫారాన్ని వాడుకునే ఛాన్స్ ఉంటుంది.

Also Read: Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. జూలై కోటా దర్శనానికి టిక్కెట్లు విడుదల..   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News