Telangana: ఆనాడే అత్యంత ధనిక సీఎం కేసీఆర్‌.. ఆయనకు హెలికాప్టర్‌ ఎక్కడిది?

Telangana MLAs Party Change: రాజకీయాల్లో 'గేట్ల అంశం' ఆసక్తికరంగా మారింది. అధికార కాంగ్రెస్‌ పార్టీ గేట్లు తెరవడంతో ఎమ్మెల్యేలు హస్తం గుర్తుకు జై కొడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 20, 2024, 08:13 PM IST
Telangana: ఆనాడే అత్యంత ధనిక సీఎం కేసీఆర్‌.. ఆయనకు హెలికాప్టర్‌ ఎక్కడిది?

Gandhi Bhavan: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ అనూహ్యంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గాలం వేస్తుండగా.. బీఆర్‌ఎస్‌ పార్టీ తిప్పి కొడుతోంది. పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రేవంత్‌ రెడ్డి తీరుపై గులాబీ పార్టీ భగ్గుమంటుండడంపై కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, విప్‌ బీర్ల అయిలయ్య స్పందించారు. 'ఒక్క గేటు తెరిస్తేనే ఉలిక్కి పడుతున్నారు. ఇక నాలుగు గేట్లు తెరిస్తే గులాబీ పార్టీ ఖాళీ అవుతుంది' అని వ్యాఖ్యానించారు.

Also Read: KT Rama Rao: కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం.. కవిత అరెస్ట్‌తో వెళ్తారా లేదా?

హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో బుధవారం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలమ్మ మీడియాతో మాట్లాడారు. 'కాంగ్రెస్‌ పార్టీతో 26 మంది బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు. త్వరలో వారంతా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారు' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే గతంలో కేసీఆర్‌ చేసిన మాదిరి శాసనసభాపక్షం మొత్తం విలీనం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు పరోక్షంగా తెలిపారు. 'ఒక్క గేటు తెరవగానే బీఆర్‌ఎస్‌ పార్టీ ఉలిక్కిపడుతోంది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఎంపీ రంజిత్‌ రెడ్డి పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని చాలామంది కార్పొరేటర్లు చేరిపోయారు. కంటోన్మెంట్‌ బీజేపీ ఇన్‌చార్జ్‌ శ్రీ గణేశ్‌ కూడా చేరారు. జిల్లాల్లోనూ గులాబీ పార్టీ నాయకులు మా పార్టీలో చేరుతున్నారు' అని బీర్ల అయిలయ్య తెలిపారు.

Also Read: KCR: గుర్రాన్ని వదిలి ప్రజలు గాడిదను తెచ్చుకున్నారు: రేవంత్‌ రెడ్డిపై కేసీఆర్‌ ఎద్దేవా

 

కాంగ్రెస్‌ పాలనను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని బీర్ల అయిలయ్య తెలిపారు. 'ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా రేవంత్‌ రెడ్డి అందుబాటులో ఉంటున్నారు' అని పేర్కొన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై స్పందిస్తూ 'ఫోన్‌ ట్యాపింగ్‌లకు కాంగ్రెస్‌ వ్యతిరేకం. అలాంటి సంస్కృతి బీఆర్‌ఎస్‌, బీజేపీలది. మల్కాజిగిరి ఎంపీ సీటుపై ఆ రెండూ పార్టీలు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈటల రాజేందర్‌ గెలవాలని గులాబీ పార్టీ చూస్తోంది. అందుకే అక్కడ డమ్మీ అభ్యర్థిని పోటీలోకి దింపింది. ఏది ఏమైనా పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ ఖాళీ అవుతున్నాయి' అని తెలిపారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ దేశంలో ఏ సీఎం సంపాదించలేనంత సంపాదించారని ఆరోపించారు. ప్రత్యేక చాపర్‌ ఎవరైనా కొన్నారా అని ప్రశ్నించారు. వంద కోట్లతో కేసీఆర్‌ చాపర్‌ ఎలా కొన్నారని నిలదీశారు. తమది ప్రజాపాలన అని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News