Vishwak Sen: అప్పుడు బాలకృష్ణ.. ఇప్పుడు రామ్ చరణ్…ఆశ్చర్యపరుస్తున్న విశ్వక్ సేన్ సీక్రెట్..

Balakrishna: యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ ప్రవర్తన కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది.. ఏదైనా సరే ఈ హీరో ముక్కుసూటిగా మాట్లాడేయటంతో కొన్నిసార్లు అది వివాదాలకు కూడా దారితీస్తూ ఉంటుంది. అయితే అలాంటి ఈ హీరో స్ట్రాటజీ ప్రస్తుతం కొంతమందికి పెద్ద మిస్టరీగా మారింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2024, 08:00 AM IST
Vishwak Sen: అప్పుడు బాలకృష్ణ.. ఇప్పుడు రామ్ చరణ్…ఆశ్చర్యపరుస్తున్న విశ్వక్ సేన్ సీక్రెట్..

Ram Charan: ఈ నగరానికి ఏమైంది చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్న హీరో విశ్వక్ సేన్. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించిన విశ్వక్ ఎన్నో వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. తన ప్రతి సినిమా ఏదో ఒక వివాదంలో చుట్టుకోవడంతో.. అలానే తను కూడా పలుమార్లు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండడంతో ..విశ్వక్ సేన్ సినిమా విడుదలవుతోంది అంటే తప్పకుండా ఏదో ఒక వివాదం ఉందే ఉంటుంది అనేలా తయారయింది పరిస్థితి.

కాగా ప్రస్తుతం ఈ హీరో గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ హీరో గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

విశ్వక్ సేన్ కి నందమూరి అభిమానుల దగ్గర నుంచి కొంచెం సపోర్ట్ ఎక్కువే. ఎందుకంటే బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న అన్‌స్టాపబుల్ కి గెస్ట్ గా వెళ్లిన విశ్వక్.. ఆ షోలో బాలయ్యకి బాగా దగ్గరయ్యారు.ఇక ఆ తరువాత నుంచి బాలయ్యని రెగ్యులర్ గా కలవడం, పార్టీలు చేసుకోవడం వంటి చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా విశ్వక్ తన కొన్ని ఈవెంట్స్ కి కూడా బాలకృష్ణ అని పిలవడం అలానే ఇంటర్వ్యూలో బాలకృష్ణ ని పొగడడం ద్వారా నందమూరి అభిమానులను బాగా దగ్గర చేసుకున్నారు.

ఇప్పుడు బాలకృష్ణ తరువాత మెగా అభిమానులను సైతం అలరించడానికి చూస్తున్నారట ఈ హీరో.  ఈ వార్త బయటకి రావడానికి ముఖ్య కారణం ఇప్పుడు విశ్వక్ ఎక్కువగా రామ్ చరణ్ ని కూడా కలుస్తున్నారట. ఆ మధ్య విశ్వక్ సేన్ నటించిన ‘ఓరి దేవుడా’ సినిమా ఫంక్షన్ కి గెస్ట్ గా వెళ్లిన రామ్ చరణ్.. ఈ మధ్య కూడా విశ్వక్ ని పర్సనల్ గా కలుసుకున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ నుంచి కూడా విశ్వక్ కి సపోర్ట్ రావడం ఖాయం అనేలా కనిపిస్తోంది. అయితే విశ్వక్ అసలు రామ్ చరణ్ ని ఎందుకు కలిశారు..? అనేది చాలామందిలో ప్రశ్నగా మారింది.

ఈ నేపథ్యంలో ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న విశ్వక్ ని అడగగా ఆయన ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చాడు. ‘రామ్ చరణ్ ని కూడా రెగ్యులర్ గా కలుసుకుంటున్నారు. ఆయనతో ఏం చర్చలు చేస్తున్నారు..?’ అని ప్రశ్నించగా, ఆ ప్రశ్నకు సమాధానం గా విశ్వక్ మాట్లాడుతూ “ఏం మాట్లాడుకున్నారు అని ఏ యాక్టర్ ని అడగకండి. ఎవరు నిజం చెప్పారు” అంటూ బదులిచ్చారు.  ఈ హీరో చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కాగా ప్రస్తుతం రామ్ చరణ్ నిర్మాతగా కొన్ని సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే నిఖిల్ తో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే విశ్వక్ తో కూడా ఏమైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా..? అనే సందేహాలు కూడా ఉన్నాయి. అయితే చాలామంది మాత్రం.. నందమూరి అభిమానులతో పాటు మెగా అభిమానులను కూడా బుట్టలో వేసుకోవడం కోసమే ఈ హీరో ఈ తెలివైన స్ట్రాటజీ ఫాలో అవుతూ ఉండొచ్చు అని కూడా అంటున్నారు.  ఏదేమైనా మెగా అభిమానులు అలానే నందమూరి అభిమానులు ఇద్దరూ కూడా విశ్వక్ వెనక నిలిస్తే ఇక ఆయన సినిమాలకు తిరుగు లేదనే చెప్పొచ్చు.

Read More: Vijay Devarakonda - Family Star: విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ ఫస్ట్ సింగిల్‌కు సూపర్ రెస్పాన్స్..

Read More: Praveen IPS: విడుదలైన ప్రవీణ్ ఐపిఎస్ ట్రైలర్.. ఫిబ్రవరి 16న థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News