Minister Roja: అవును రోజా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఎంపీగా పోటీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈమెను ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలని అధికార పార్టీ భావిస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ ఇవ్వడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సుముఖంగా లేడు. ఈయన టీడీపీ తరుపున ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని ధీటుగా ఎదుర్కొవడానికి రోజాను ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేయించడానికి జగన్ ఇప్పటికే అంతా సిద్దం చేసినట్టు సమాచారం. మాగుంట వంటి బలమైన నేతను ఎదుర్కొవడానికి అదే సామాజిక వర్గానికి చెందిన రోజాను బరిలో దింపాలేనే ఆలోచనలో ఉన్నారు రోజా. త్వరలో అధికారిక సమాచారం రానుంది.
మినిస్టర్ రోజా గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన తర్వాత ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించింది. అక్కడా ఎన్నో ఒడిదుడుకులు ఎదర్కొని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే.. రెండు సార్లు ఓటమి పాలై మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టింది. ముందుగా తెలుగు దేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఈమె తెలుగు మహిళ అధ్యక్షురాలిగా పనిచేసింది. ఆ తర్వాత 2004లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత 2009 నుంచి తెలుగు దేశం పార్టీ తరుపున నగరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయాల్లో చాలా మంది ఓ సారి ఓడిపోయిన తర్వాత పాలిటిక్స్‌లో కొనసాగడానికి ఇంట్రెస్ట్ చూపించరు.
కానీ రోజా మాత్రం రెండు సార్లు ఓటమి పాలైనా.. ఎక్కడా కృంగిపోకుండా ముచ్చటగా మూడోసారి 2014లో నగరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. కానీ రోజా ప్రాతినిథ్యం వహించిన వైయస్‌ఆర్సీపీ అధికారంలోకి రాకపోయింది. దీంతో మరోసారి రోజాను ఐరన్ లెగ్ అన్నారు.
ఆ తర్వాత 2019లో కూడా నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు తాను పోటీ చేసిన వైసీపీ అధికారంలోకి వచ్చి ఐరన్ లెగ్ అనే ముద్ర చెరిపేసుకుంది. అంతేకాదు మొదటిసారి మంత్రి వర్గ విస్తరణలో రోజాకు మంత్రి పదవి ఖాయం అనుకున్నా.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆమెకు పదవి దక్కలేదు. ఆ తర్వాత జగన్ ఈమెకు ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు.
ఆ తర్వాత జరిగిన రెండో మంత్రి వర్గ విస్తరణలో రోజాకు పర్యాటక శాఖను కేటాయించారు. ప్రస్తుతం రోజా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మంత్రి కానంత వరకు సినిమాలు, జబర్దస్త్ కామెడీ షో జడ్జ్‌గా వ్యవహరించిన రోజా.. మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో వాటిని పూర్తిగా విడిచిపెట్టి రాజకీయాలకే పరిమితమైంది.
ఇదీ చదవండి: ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!
ఇదీ చదవండి: మీపేరు ఈ 2 అక్షరాలతో మొదలవుతుందా? అయితే, మీలవ్ బ్రేకప్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook