Kuppam: చంద్రబాబు రెండు చోట్ల పోటీ.. కుప్పంలో ఓటమి భయమంటూ మంత్రి వ్యాఖ్యలు

Babu Two Seats Contest: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల యుద్ధం మొదలైంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఎన్నికల సమరశంఖం పూరించాయి. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య విమర్శలు మొదలయ్యాయి. టీడీపీలో ఓటమి భయం నెలకొందని.. ఆ భయంతోనే చంద్రబాబు కుప్పంతో మరోస్థానంలో పోటీ చేస్తారనే వార్త కలకలం రేపింది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 27, 2024, 10:25 PM IST
Kuppam: చంద్రబాబు రెండు చోట్ల పోటీ.. కుప్పంలో ఓటమి భయమంటూ మంత్రి వ్యాఖ్యలు

YSRCP CleanSweep: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుందని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. గత ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు దాదాపు ఓటమి అంచుల దాకా వెళ్లారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ భయంతోనే మరో నియోజకవర్గం నుంచి చంద్రబాబు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ మాదిరి చంద్రబాబు కూడా రెండు చోట్ల పోటీ చేసేందుకు చూస్తున్నారని చెప్పారు. తిరుపతిలో శనివారం జరిగిన సత్యవేడు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

కుప్పంలో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. అందుకే మరో చోట పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. ఉత్తరాంధ్రలో మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు చూస్తున్నారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకే గ్యారంటీ లేదని విమర్శించారు. ఇంకా ఎవరికీ గ్యారెంటీ ఇస్తారని టీడీపీ మేనిఫెస్టోను ఉద్దేశించి విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ముసుగులో జగన్‌ కుటుంబాన్ని చంద్రబాబు చీల్చారని మండిపడ్డారు. చంద్రబాబు స్క్రిప్టునే షర్మిల చదువుతున్నారని తెలిపారు. ఎన్నికల్లో గెలిచేందుకు బాబు, ఆయన బృందం ఎన్ని కుట్రలు చేసినా వచ్చేది జగన్‌ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. వైనాట్‌ 175 స్థానాల్లో చంద్రబాబు సీటు కుప్పం కూడా వైసీపీ ఖాతాలో చేరుతుందని ప్రకటించారు. 

మేనిఫెస్టోలో ప్రకటించి ప్రతి హామీని అమలుచేసిన ఘనత సీఎం జగన్‌ది అని పెద్దిరెడ్డి తెలిపారు. మేనిఫెస్టోను 99 శాతం అమలు చేసినట్లు చెప్పారు. పీలేరు సభలో చంద్రబాబు అన్ని పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి వ్యక్తి చిత్తూరు జిల్లాలో ఎలా పుట్టారని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. బాబు మాటలు ఎవరూ నమ్మవద్దని, అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట.. లేనప్పుడు ఒకమాట చంద్రబాబు నైజం అని తెలిపారు. సత్యవేడులో గురుమూర్తిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు.

Also Read: Harish Rao: 'గ్యారంటీ'ల అమలుకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ మెడలు వంచాలి: హరీశ్‌ రావు పిలుపు

Also Read: Bihar: రేపే బిహార్ సీఎం నితీశ్‌ రాజీనామా? ఎన్డీయేలో చేరడం లాంఛనమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News