Grahan Solar Eclipse Live Updates: 2023 సంవత్సరంలో రెండవ, చివరి సూర్యగ్రహణం ఈ రోజు సంభవించబోతోంది. ఇదే రోజు సర్వపిత్రి అమావాస్య కూడా రావడంతో ఎంతో ప్రత్యేకమైన రోజుగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పరిగణిస్తున్నారు. ఈ గ్రహణం అక్టోబర్ 14 రాత్రి 08:34 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 15 తెల్లవారుజామున 02:26 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడుకి అడ్డంగా వెళ్లడంతో భూమిపైకి మందమైన సూర్యకాంతి పడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. దీనినే రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారు. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు భూమికి చాలా దగ్గరగా వస్తూ ఉంటాడు. దీంతో సూర్యుడు పెద్దదిగా కనిపిస్తుంది. అయితే ఈ చివరి సూర్యగ్రహణం భారత్‌పై అతంగా ప్రభావం చూపదని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ చివరి సూర్యగ్రహణం విశిష్టత ఏంటో, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గర్భిణీ స్త్రీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి:
గ్రహణ సమయంలో ప్రకృతిలో శరీరానికి దుష్ప్రభావాలు కలిగించే అనేక రకాల హానికరమైన కిరణాలు కలిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీలైతే ఇంట్లోనే ఉండడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరు ఇష్టదేవతా మత్రాన్ని జపించడం చాలా మంచిది.
ఈ రాశులవారిపై ప్రభావం:
మేష రాశి:
మేష రాశివారికి ఈ సమయంలో మాటల్లో మాధుర్యం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా మనసు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక వ్యాపారాలు చేసేవారికి చాలా లాభదాయకంగా ఉండే ఛాన్స్‌లు ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారు విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో ఖర్చులు తగ్గి, ఆదాయ వనరులు కూడా సులభంగా పెరుగుతాయి.
వృషభ రాశి:
వృషభ రాశివారికి ఉద్యోగాల్లో అధికారుల మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా పనులు చేసే ప్రదేశాల్లో కూడా అనేక రకాల మార్పులు సంభవిస్తాయి. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు వీరు ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా సోదరుల నుంచి మద్దతు లభించి అనుకున్న పనులన్నీ సులభంగా చేయగలుగుతారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
మిథున రాశి:
గ్రహణ సమయంలో మిథున రాశిరికి మానసిక ప్రశాంతత మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి సులభంగా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో కుటుంబంలోని పెద్దల నుంచి ఊహించని ఆదాయం పొందుతారు. అంతేకాకుండా ప్రగతికి బాటలు వేయడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశివారికి మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. దీంతో పాటు మానసిక సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో వీరికి సహనం తగ్గే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అయితే ఆరోగ్య విషయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వీరు ఈ సమయంలో అదనపు బాధ్యతలు కూడా పొందుతారు.
మకర రాశి:
ఈ గ్రహణ సమయంలో మనసులో హెచ్చు తగ్గులు ఉంటాయి. తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. జీవితం బాధాకరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగాలు చేసేవారికి ఎక్కువ శ్రమ ఉంటుంది. వ్యాపారంలో రిస్క్ తీసుకోకుండా ఉండండి. ఈ సమయంలో మీ స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..