Bigg Boss 7 Eliminations: హౌస్ నుంచి రతిక ఔట్.. బిగ్‌ బాస్‌ హిస్టరీలో ఇదే తొలిసారి..!

BB 7 Telugu Updates: తెలుగు బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. నాలుగో వారం రతిక్ రోజ్ ఎలిమినేట్ అయింది. వరుసగా నలుగురు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్  కావడం బిగ్ బాస్ చరిత్రలో ఇదే తొలిసారి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2023, 11:09 AM IST
Bigg Boss 7 Eliminations: హౌస్ నుంచి రతిక ఔట్.. బిగ్‌ బాస్‌ హిస్టరీలో ఇదే తొలిసారి..!

Bigg Boss 7 Telugu 04th Week Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 07 నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఆదివారం ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. మెుదటి శివాజీ నేను ఎందుకు అనర్హుడినే చెప్పాలని నాగార్జునను ప్రశ్నించారు. ఈ విషయానికి సంబంధించి కింగ్ శోభాను ప్రశ్నించారు. నాగ్ ప్రశ్నలకు ఈ అమ్మడు సరైన సమాధానాలు చెప్పలేకపోయింది. సందీప్ కూడా తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. గౌతమ్ ను కూడా నాగ్ నిలదీశాడు. శివాజీ అడిగిన ప్రశ్నకు కంటెస్టెంట్స్ ఎవరూ సరైన ఆన్షర్ ఇవ్వలేక బిక్కమెుఖం వేశారు. ఎదుటి వారిని వేలెత్తి చూపేటప్పుడు ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలని నాగ్ ఈ సందర్భంగా కంటెస్టెంట్స్ కు చురకలంటించారు. అనంతరం బొమ్మ గియ్.. గెస్ చేయ్ అనే గేమ్ పెట్టాడు. ఇందులో గెలిచిన వారికి లగ్జరి బడ్జెట్ ఇచ్చాడు నాగ్. 

ఇక నామినేషన్ లో ప్రియాంక, ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, రతిక రోజ్, టేస్టీ తేజా, గౌతమ్ కృష్ణ ఉన్న సంగతి తెలిసిందే. ప్రియాంక శనివారం సేఫ్ అయింది. ఆదివారం ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, గౌతమ్ కృష్ణ ముందుగా సేప్ అయ్యారు. చివరకు రతిక రోజ్, టేస్టీ తేజా నిలిచారు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని.. వీరిద్దరూ ఎలిమినేట్ అవుతారని నెట్టింట వార్తలు హాల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. కానీ బిగ్ బాస్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నాలుగో వారం ఒక కంటెస్టెంట్ ను మాత్రమే ఎలిమినేట్ చేశారు. 

ఈ వారం రతిక రోజ్ ఎలిమినేట్ అయింది. ఈ సీజన్‍లో వరుసగా నలుగురు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడం విశేషం. ప్రశాంత్, యావర్‍తో లవ్ ట్రాక్ నడపి వారికి వెన్నుపోటు పోడవడం, శివాజీ విషయంలో రాంగ్ స్టెప్స్ వేయడం ఆమెపై నెగిటివిటీకి కారణాలుగా తెలుస్తోంది. ఇప్పటికే హౌస్ నుంచి కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇలా నలుగురు వుమెన్స్ వరుసగా ఎలిమినేట్‌ అవడం తెలుగు బిగ్‌ బాస్‌ చరిత్రలో ఇదే తొలిసారి.

Also Read: OTT Movies: అక్టోబర్‌లో విడుదల కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల జాబితా ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News