Snake Bite In Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని పాము కాటు వేయగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఫూప్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాణి విరగ్వాన్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో తల్లి, కుమార్తె మరణించారు. కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు ఇలా.. శనివారం రాత్రి ముకేశ్ బరేతా అనే వ్యక్తి కుటుంబ సభ్యులు నిద్రలో ఉన్నారు. ఇంట్లోకి దూరినపాము.. తల్లి, కూతురు, కొడుకు ముగ్గురిని ఒకరి తరువాత ఒకరిపై కాటు వేసింది. తల్లి, సోదరి, సోదరుడు పాము కాటుకు గురయ్యారని చిన్న కుమార్తె తన తండ్రికి చెప్పగా.. ముఖేష్ బరేతా కూడా స్పృహతప్పి పడిపోయాడు.
ముగ్గురిని పాము కాటు వేసి విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు వారిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు.. ముఖేష్ బరేతా భార్య రాధా బరేత, కుమార్తె జీసస్ మరణించినట్లు తెలిపారు. కుమారుడు కృష్ణ చికిత్స అందించగా కోలుకున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. స్పృహ తప్పి పడిపోయిన ముకేశ్‌కు వైద్యుల చికిత్సతో మెళుకవలోకి వచ్చాడు. భార్య, కూతురి మృతి, కుమారుడి పరిస్థితి విషమించడం చూసి ముకేశ్ షాక్‌కు గురయ్యాడు. ఇద్దరి మరణంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
కుటుంబ సభ్యులు ఇంట్లో నేలపై నిద్రిస్తున్న సమయంలోనే పాము కాటు వేసింది. వెంటనే గుర్తించినా.. సకాలంలో ఆసుపత్రికి తీసుకు వెళ్లకుండా ఆలస్యం చేశారు. భూతవైద్యం కోసం హడావిడిగా వేరే గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ ఫలితం లేకపోవడంతో ముగ్గురిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి శరీరంలో పాము కాటుకు సంబంధించిన లక్షణాలు కనిపించాయని జిల్లా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. బాధితులను చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తీసుకు రాకుండా.. అటు ఇటు తిరగడంతో ఇద్దరు మరణించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్లోకి సీఎన్జీ బైక్‌లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి