Drohi Movie First Look Poster: ద్రోహి మూవీ ఫస్ట్‌ లుక్‌ విడుదల.. డైరెక్టర్ క్రిష్‌ అభినందనలు

Director krish launched Drohi Movie First Look: ద్రోహి మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను లాంచ్ చేశారు డైరెక్టర్ క్రిష్. విజయ్‌ పెందుర్తి  దర్శకత్వం వహిస్తుండగా.. సందీప్‌ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ హీరోహీరోయిన్స్‌గా నటిస్తున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 8, 2023, 04:28 PM IST
Drohi Movie First Look Poster: ద్రోహి మూవీ ఫస్ట్‌ లుక్‌ విడుదల.. డైరెక్టర్ క్రిష్‌ అభినందనలు

Director krish launched Drohi Movie First Look: సందీప్‌ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ జంటగా విజయ్‌ పెందుర్తి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ద్రోహి’. ది క్రిమినల్‌ అనే ఉపశీర్షికతో క్రైమ్ థ్రిల్లర్‌గా ఆడియన్స్ ముందుకు రానుంది. గుడ్‌ ఫెల్లోస్‌ మీడియా ప్రొడక్షన్స్‌, సఫైరస్‌ మీడియా, వెడ్‌నెస్‌డే ఎంటర్టైన్మెంట్‌  సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్‌ రెడ్డి, విజయ్‌ పెందుర్తి, ఆర్.రాజశేఖర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెలలోనే ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టారు. ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ప్రముఖ డైరెక్టర్ క్రిష్‌ జాగర్లమూడి రిలీజ్ చేశారు. పోస్టర్ విడుదల సందర్భంగా క్రిష్‌ మాట్లాడుతూ.. సినిమాకు సంబంధించిన లుక్‌, గ్లింప్స్‌ చూశానని.. చాలా ప్రామిసింగ్‌గా ఉందని తెలిపారు. చక్కని చిత్రబృందం ఈ సినిమా చేసిందని తెలిపారు. ఈ మూవీ చక్కని విజయం సాధించి..
నటీనటులు, సాంకేతికి నిపుణులు అందరూ మంచి పేరు రావాలని ఆకాక్షించారు. ఈ చిత్రం విజయంతో వాళ్లందరూ సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని అన్నారు. మూవీ టీమ్‌ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. చక్కని థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమని తెలిపారు. ఆడియన్ మెచ్చే అన్ని అంశాలు చిత్రంలో ఉంటాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కావొచ్చాయని చెప్పారు. ఈ నెలలో సినిమాను రిలీజ్ చేస్తామని వెల్లడించారు. డెబి, షకలక శంకర్‌, నిరోజ్‌, శివ, మహేష్‌ విట్ట, మెహబూబ్‌ ఇతర పాత్రల్లో నటించారు. ఎడిటర్‌గా జానీ బాషా పనిచేయగా.. అనంత్‌ నారాయణ సంగీతం అందించారు. 

Also Read: Home Guard Ravinder Death: అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ దిక్కులేదు.. సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ  

Also Read: AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20 నుంచి, ఎజెండా ఏంటంటే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News