Foods Cooked In Good Oil For Kidneys: శరీరం ఆరోగ్యంగా ఉండడానికి శరీరానికి పోషకాలు కలిగిన ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా క్రమం తప్పకుండా వ్యాయామాలు కూడా చేయాలి. దీంతో పాటు బాడీకి తగిన విశ్రాంతితో పాటు వ్యాయామాలు కూడా తప్పనిసరని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రక్రియల వల్లే శరీరంలోని అవయవాలు కూడా మెరుగుపడతాయి. అనారోగ్యకరమైన ఆహారాల కారణంగా చాలా మందిలో కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. దీంతో పాటు కిడ్నీలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కాబట్టి శరీరంలోని మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
శరీరంలోని వ్యర్థ పదార్థాలు తొలగించేందుకు మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా శరీరంలోని ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి వీటిని పనితీరు బాగుంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఇప్పటికే మూత్రపిండాల సమస్యలతో బాధపేడేవారు ఆధునిక జీవనశైలికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా రోజూ ఆహారం వండుకుని తినే నూనెపై కూడా శ్రద్ధ పెట్టాలి. అంతేకాకుండా ప్రతి రోజు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని నూనెలను తీసుకోవాల్సి ఉంటుంది.
ఆలివ్ ఆయిల్ కిడ్నీ సమస్యలను తగ్గిస్తుందా?:
ప్రస్తుతం చాలా మంది మార్కెట్‌లో లభించే అనారోగ్యకరమైన నూనెలను వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా ఆలివ్ నూనెలను ప్రతి రోజు వినియోగించడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా ఆలివ్ నూనెలో అసంతృప్త కొవ్వు, విటమిన్-ఇ వంటి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ నూనెను వినియోగించడం వల్ల కిడ్నీల పనితీరు కూడా మెరుగుపడుతుంది.
ఇది కూడా చదవండి : Independence Day 2023: స్వతంత్ర భారతావనిలో టాప్ 10 కార్లు, బైకులు
కిడ్నీ ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా ఈ ఆహారాలు తీసుకోండి:
1. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతి రోజు ఆహారంలో వెల్లుల్లి-ఉల్లిపాయలను అధిక పరిమాణంలో వినియోగించాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు తీసుకోవడం వల్ల కిడ్నీ పర్ఫెక్ట్‌గా ఫిట్‌గా మారుతాయి. అంతేకాకుండా వీటిల్లో ఉండే విటమిన్ బి6, మాంగనీస్, కాల్షియం వంటి పోషకాలు కిడ్నీ వాపు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఆహారంలో తప్పనిసరిగా వీటిని తీసుకోవాల్సి ఉంటుంది.
2. కిడ్నీ పనితీరును మెరుగుపర్చడానికి క్రూసిఫరస్ కుటుంబానికి చెందిన కూరగాయలు కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆహారంలో క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీ వంటి ఆకు కూరలను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అధిక పరిమాణంలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వీటిని ఆహారాల్లో తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
ఇది కూడా చదవండి : Independence Day 2023: స్వతంత్ర భారతావనిలో టాప్ 10 కార్లు, బైకులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి