Anti Ageing Tips: ప్రస్తుతం చాలా మంది అందంగా, యవ్వనంగా కనిపించడానికి వివిధ రకాల ప్రోడక్ట్ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల తీవ్ర చర్మ సమస్యలు వస్తున్నాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. వీటికి బదులుగా నిపుణులు సూచించిన సహజ పద్ధతులతో పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తరచుగా చర్మ సమస్యలతో బాధపడేవారు ఈ చిట్కాలను వినియోగించడం వల్ల చర్మం ఫిట్‌గా, యంగ్‌గా తయారవుతుంది. అయితే ఎలాంటి చిట్కాలను ప్రతి రోజు పాటించడం వల్ల చర్మానికి మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చర్మం యవ్వనంగా కనిపించేందుకు..
✺ ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది ఒత్తిడి సమస్యల బారిన కూడా పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా రాత్రి పూట మనసుకు విశ్రాంతి చాలా అవసరం. దీని కోసం రాత్రి పూట 8 నుంచి 9 గంటల పాటు పడుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రాత్రి పూట ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వృద్ధాప్య చర్మ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
✺ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉండడానికి తప్పకుండా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ప్రతి రోజు నీటిని అధిక పరిమాణంలో తాగాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల చర్మాన్ని యవ్వనంగా కనిపిస్తుంది.
Also Read: Guntur Karam Movie: 'గుంటూరు కారం' నుంచి పూజా హెగ్డే ఔట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..?
✺ చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుకోవడానికి క్లెన్సర్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వంటి ప్రోడక్ట్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. వీటిలో కూడా అతిగా రసాయనాలతో కూడిన వాటిని వినియోగించకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
✺ చర్మం ఎక్కువ కాలం ఫిట్‌గా, యవ్వనంగా ఉండడానికి పండ్లను ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
✺ 30 ఏళ్లు దాటినా వారిలో చాలా వరకు చర్మంపై యవ్వనం తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటి సమస్యల రాకుండా ఉండడానికి ప్రతి రోజు మానసిక వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Guntur Karam Movie: 'గుంటూరు కారం' నుంచి పూజా హెగ్డే ఔట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి