Sundar Pichai, Satya Nadella Remuneration: ఎలాన్ మస్క్ : కార్పొరేట్ కంపెనీ కల్చర్‌లో ఏ మాత్రం పరిచయమే అక్కర్లేని పేరు ఎలాన్ మస్క్. టెస్లా, స్పేస్ఎక్స్, ట్విటర్‌తో పాటు అనేక ఇతర ఐటి కంపెనీలకు సీఈఓగా ఉన్న ఎలాన్ మస్క్ 2023 గణాంకాల ప్రకారం సీఈఓగా 23.5 బిలియన్ డాలర్ల వేతనం అందుకుంటున్నాడు.
సుందర్ పిచాయ్ : కార్పొరేట్ ప్రపంచ పటంలో భారతీయలను అగ్రస్థానంలో నిలబెట్టిన వారిలో సుందర్ పిచాయ్ ఒకరు. ప్రపంచం అంతా గూగుల్ వెంట పడుతున్న ఈ పోటీ ప్రపంచంలో.. గూగులే సుందర్ పిచాయ్ కి ప్రాధాన్యత ఇస్తూ ఆయన్ను సీఈఓగా నియమించడంతో యావత్ ప్రపంచం మరొకసారి భారత్ వైపు దృష్టిసారించింది. 2022 నాటి గణాంకాల ప్రకారం గూగుల్ కంపెనీ సీఈఓగా సుందర్ పిచాయ్ 226 మిలియన్ అమెరికన్ డాలర్స్ పారితోషికం అందుకుంటున్నారు.
టిమ్ కుక్ : యాపిల్ సంస్థ తయారు చేసే మాక్ సిస్టమ్స్, ఐ ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖరీదు ఎక్కువైనా సరే యాపిల్ ప్రోడక్ట్స్ కొని తీరాల్సిందే అని కస్టమర్స్ అనుకునే స్థాయికి ఆ కంపెనీ ఎదిగింది. అలాంటి యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ శాలరీ 133.7 అమెరికన్ మిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2019 నాటి సమాచారం మాత్రమే. తాజా సమాచారం అప్డేట్ కావాల్సి ఉంది.
మార్క్ హర్డ్, సఫ్రా క్యాజ్: ప్రపంచంలోనే పేరున్న ఐటి కంపెనీల్లో ఒకటైన ఒరాకిల్ కంపెనీకి మార్క్ హర్డ్, సఫ్రా క్యాజ్ ఇద్దరూ కో-సీఈఓలుగా వ్యవహరిస్తున్నారు. 2016 లో మార్క్ వేతనం 41.1 మిలియన్ డాలర్లు ఉండగా.. సఫ్రా వేతనం 40.9 మిలియన్ డాలర్లుగా ఉంది.
బాబీ కొటిక్ : యాక్టివిజన్ బ్లిజర్డ్ అనే సంస్థకు బాబీ కొటిక్ సీఈఓగా ఉన్నారు. 2016 లోనే సీఈఓగా బాబీ శాలరీ 33.1 మిలియన్ డాలర్లుగా ఉంది.
సత్య నాదెళ్ల : అస్సలే మాత్రం పరిచయం అక్కర్లేని ఐటి కంపెనీల్లో మైక్రోసాఫ్ట్ ఒకటి అని చెప్పుకోవడం కూడా ఆ కంపెనీ ఇమేజ్ కి తక్కువే అవుతుంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓగా 2020 లోనే సత్య నాదెళ్ల 44.3 మిలియన్ డాలర్లు శాలరీ అందుకున్నారు.
రీడ్ హేస్టింగ్స్ : ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీలో వరల్డ్ వైడ్ గా క్లిక్ అయిన ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ సీఈఓగా ఉన్న రీడ్ హెస్టింగ్స్ 2020 లో 38.6 మిలియన్ డాలర్ల పారితోషికం అందుకున్నారు.
బ్రియన్ రాబర్ట్స్ : కామ్‌కాస్ట్ కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. 2020 లో ఈ కంపెనీకి సీఈఓగా బ్రియన్ రాబర్ట్స్ 32.7 మిలియన్ డాలర్ల రెమ్యునరేషన్ అందుకున్నాడు.
శంతను నారాయెన్ : వీడియో, ఆడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న అడోబ్ కంపెనీ సీఈఓ శంతను నారాయెన్ 2022 45.9 మిలియన్ డాలర్ల పారితోషికం అందుకున్నాడు.