Onion Juice For Hair Fall: ఉల్లిపాయ రసంలో అనేక పోషకాలతో పాటు విటమిన్లు బితో పాటు విటమిన్ సి, ఇతర ఖనిజాలు అధికంగా లభిస్తాయి. తరచుగా జుట్టుకు ఉల్లిపాయ రసాన్ని అప్లై చేసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అలాగే ఇందులో పొటాషియం, మాంగనీస్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి తరచుగా జుట్టుకు వినియోగించడం వల్ల హెయిర్ గ్రోత్ పొందుతారని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఉల్లిపాయ రసంలో క్వెర్సెటిన్‌తో పాటు సల్ఫర్ సమ్మేళనాలు కూడా ఎక్కువ మోతాదులో అందుబాటులో ఉంటాయి. కాబట్టి రోజు జుట్టుకు వినియోగించడం వల్ల అన్ని జుట్టు సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ఇందులో ఎక్కువ పరిమాణంలో ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఇవి జుట్టుకు ఎలాంటి లాభాలను అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల కలిగే లాభాలు:
జుట్టు పెరుగుదల:
ఉల్లిపాయ రసంలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది.. ఇది జుట్టు పెరుగుదలకు అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ రసాన్ని జుట్టుకు అప్లై చేసి 10 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి.. శుభ్రం చేసుకోవడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు.
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది:
ఉల్లిపాయ రసం జుట్టుకు అప్లై చేయడం వల్ల కుదుళ్లను దృఢంగా చేసేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది. అలాగే జుట్టు రాలడం కూడా పూర్తిగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి జట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా రసాన్ని జుట్టుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
చుండ్రును తగ్గిస్తుంది:
ఉల్లిపాయ రసంలో యాంటీ బాక్టీరియల్‌తో పాటు యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి చుండ్రును నివారించడానికి కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల చుడ్రు తగ్గడమే కాకుండా జుట్టు సాధరణ రంగులోకి కూడా మారుతుంది. కాబట్టి చుండ్రు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రసాన్ని జుట్టుకు వినియోగించాల్సి ఉంటుంది.
జుట్టును నిగనిగలాడేలా చేస్తుంది:
ఉల్లిపాయ రసంలో ఎన్నో రకాల ఖనిజాలతో పాటు వివిధ రకాల పోషకాలు లభిస్తాయి. ఇవి సహజమైన మెరుపును అందించేందుకు సహాయపడుతుంది. జుట్టును దృఢంగా చేసి.. సాధరణ రంగును అందించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఖనిజాలు జుట్టుకు పోషణను కూడా ఎంతో తోడ్పడతాయి.
Also read: Allu Arjun: అల్లు అర్జున్‌కు అరుదైన ఖ్యాతి, హాలీవుడ్ మేగజైన్ కవర్ పేజిపై బన్నీ ఫోటో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి