Oats Vada Recipe In Telugu: ఓట్స్‌లో శరీరానికి కావలసిన ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే బీటా-గ్లూకాన్ అనే రకమైన ఫైబర్ గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది శరీరంలోని పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా కరిగించి మంచి కొవ్వును అభివృద్ధి చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఇందులో కరిగే ఫైబర్ కూడా ఉంటుంది.
కాబట్టి మధుమేహం ఉన్నవారు ప్రతిరోజు ఉదయం టిఫిన్‌గా ఓట్స్‌ను తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జీర్ణ క్రియను మెరుగుపరచడమే కాకుండా మలబద్ధకం, పొట్ట సమస్యలు సులభంగా దూరమవుతాయి. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇవి ఎంతగానో సహాయపడతాయి. అయితే చాలామందికి ఓట్స్‌ను ఒకే రకమైన రెసిపీని తినడం వల్ల బోర్ కొడుతూ ఉంటుంది. రోజు మేము తక్కువ ఆయిల్‌తో మొక్కజొన్న వడలు లాగా ఓట్స్ వడ రెసిపీని పరిచయం చేయబోతున్నాం. అయితే ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో? వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ వడ రెసిపీకి కావలసిన పదార్థాలు:
1 కప్పు ఓట్స్
1/2 కప్పు ఉల్లిపాయ, తరిగినది
1/4 కప్పు కొత్తిమీర, తరిగినది
1/4 కప్పు కరివేపాకు, తరిగినది
1/2 అంగుళం అల్లం, తురిమినది
2 పచ్చిమిర్చి, తరిగినది
1/2 టీస్పూన్ జీలకర్ర
1/2 టీస్పూన్ కారం
1/2 టీస్పూన్ ఉప్పు
నూనె వేయడానికి
తయారీ విధానం:
ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఓట్స్‌ను 15 నిమిషాలు నానబెట్టుకోండి.
ఒక గిన్నెలో నానబెట్టిన ఓట్స్ లోనే ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.
ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని దాదాపు గంట లేదా రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత స్టవ్ పై కళాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి కావలసినంత నూనెను వేసుకొని బాగా వేడి చేసుకోవాల్సి ఉంటుంది.
వేడి చేసుకున్న తర్వాత ఈ పిండిని వడల్లాగా ఒత్తుకొని నూనెలు వేసుకోవాలి.
ఇలా వేసుకున్న వడలను గోధుమ రంగులోకి వచ్చేంతవరకు బాగా వేయించుకోవాలి.
ఆ తర్వాత వేడివేడిగా టమాటా కర్రీతో లేదా పల్లి చట్నీ తో తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి మీ సొంతం..
చిట్కాలు:
ఓట్స్‌ను ముందుగా రోస్ట్ చేసుకుంటే వడలకు మంచి రుచి వస్తుంది.
మీకు ఇష్టమైన కూరగాయలను కూడా వడలకు కలుపుకోవచ్చు.
వడలను ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి నూనెకు బదులుగా ఎయిర్ ప్రయర్స్ లేదా మైక్రో ఓవెన్ వినియోగించవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి