Natural Remedies For Pimples: ముఖంపై మొటిమలు తగ్గాలంటే ఈ టిప్స్‌ ఖచ్చితంగా పాటించండి..!

Homeremedies For Pimples: చర్మంపై మొటిమలు రావడం ఎంతో సహజం. కానీ వీటి వల్ల చర్మం వికారంగా కనిపిస్తుంది.  దీని కోసం చాలామంది ఫేస్‌ క్రీములు,మాస్క్‌లు ఉపయోగిస్తారు. వీటితో పని లేకుండా సహాజంగా మొటిమలకు ఎలా గుడ్‌ బై చెప్పవచ్చు అనేది తెలుసుకుందాం.   

Written by - Shashi Maheshwarapu | Last Updated : Feb 17, 2025, 02:02 PM IST
Natural Remedies For Pimples: ముఖంపై మొటిమలు తగ్గాలంటే ఈ టిప్స్‌ ఖచ్చితంగా పాటించండి..!

Homeremedies For Pimples: మొటిమల సమస్యతో నేటి కాలం యువత ఇబ్బంది పడుతున్నారు. మొటిమలు రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. యుక్తవయస్సులో హార్మోన్ల మార్పుల కారణంగా మొటిమలు వస్తాయి. జిడ్డు చర్మం గలవారికి మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువ. మొటిమలకు బ్యాక్టీరియా కూడా ఒక కారణం. చర్మ రంధ్రాలు మూసుకుపోవడం వల్ల మొటిమలు వస్తాయి. ఒత్తిడి కూడా మొటిమలకు కారణం కావచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  చాలా మంది ఈ సమస్య నుంచి బయటపడడానికి వివిధ రకాల ఫేస్‌ క్రీములు, ఫేస్‌ మాస్క్‌లను ఉపయోగిస్తారు. ఇవి తతాల్కిక ఉపశమన్నాని అందిస్తుంది. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే చర్మ సంరక్షణ పొందడం ఎలాగో తెలుసుకుందాం.  

మొటిమల తగ్గించడానికి ఇంటి చిట్కాలు: 

వేప: వేప ఆకులను నీటిలో వేసి మరిగించి, ఆ నీటిని చల్లారిన తర్వాత మొటిమలపై రాయాలి. ఇది మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.

పసుపు: పసుపును నీటితో కలిపి పేస్ట్ లా చేసి మొటిమలపై రాయాలి. ఇది మొటిమలను తగ్గించడంలో చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

తేనె: తేనెను మొటిమలపై రాయడం వల్ల మొటిమలు తగ్గుతాయి, చర్మం మృదువుగా మారుతుంది.

నిమ్మకాయ: నిమ్మకాయ రసాన్ని మొటిమలపై రాయడం వల్ల మొటిమలు త్వరగా తగ్గుతాయి.

గుడ్డులోని తెల్లసొన: గుడ్డులోని తెల్లసొనను మొటిమలపై రాయడం వల్ల మొటిమలు తగ్గుతాయి, చర్మం బిగుతుగా మారుతుంది.

చెందనం: చెందనం చర్మ సంరక్షణలో కీలక ప్రాత పోషిస్తుంది. ఇది మొటిమలను తగ్గించడం సహజ నివారిణి. చెందనంను ప్రతిరోజు రాసుకోవడం వల్ల మొటిమలు, పొడి చర్మం సమస్యలు తగ్గుతాయి. 

పెరుగు, పసుపు: పెరుగులో పసుపు కలుపుకొని చర్మాన్నికి రాసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. పెరుగులోని లక్షణాలు చర్మంను పొడి బారకుండా చేయడంతో పాటు మొటిమలు రాకుండా చేస్తుంది. 

పాలు: పాలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా సహాయపడుతుంది. ఇది చర్మం పై ముడతలు పడకుండా రక్షిస్తుంది. 

శెనగపిండి: శెనగపిండి చర్మాన్నికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మొటిమలను, నల్ల మచ్చలను తగ్గించడంలో కీలక ప్రాత పోషిస్తుంది. 

ఈ పదార్థాలు ఇంట్లో ఎల్లప్పుడు లభిస్తాయి. వీటితో సహజంగా చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు. అలాగే మొటిమలు తగ్గించడంలో కీలక ప్రాత పోషిస్తుంది. బయట ఖరీదైన క్రీములు, మాస్క్‌లు ఉయోగించి బదులు మీరు ఇంట్లోనే ఈ చిట్కాలను పాటించడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే ఉయోగించే ముందు ప్యాచ్‌ టెస్ట్ చేసుకోవడం మంచిది.

 

 

 

 

 

 

Also read: HMPV Alert: బెంగళూరులో చైనా వైరస్, అప్రమత్తమైన పొరుగు రాష్ట్రాలు, హై అలర్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News