How To Protect Your Kidney: కిడ్నీ మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. దీని ప్రధాన పని మన శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఒకవేళ కిడ్నీల్లో తీవ్ర సమస్యలు ఉత్పన్నమయితే శరీరంలో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవి విఫలం చెందడం వల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి కిడ్ని పేయిల్ డయాలసిస్‌ను ఆశ్రయించాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కిడ్ని సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు చెడు అలవాట్లేనని నిపుణులు చెబుతున్నారు. అయితే తప్పకుండా ఈ సమస్య బారిన పడకుండా ఈ నియమాలు పాటించాల్సి ఉంటుంది.
ఈ నియమాలు పాటించాలి:
1. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవద్దు:
సాధారణంగా మనం ప్రయాణంలో ఉన్నప్పుడు మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటారు. ఇలా చేయడం తరుచుగా చేయడం వల్ల కిడ్నీపై ఒత్తిడి ఏర్పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా తీవ్ర కిడ్ని సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలా చేయడం హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
2. తక్కువ నీరు త్రాగడం:
మన శరీరంలో చాలా అవయవాలు నీటితో ముడిపడి ఉంటాయి. కాబట్టి శరీరం హైడ్రేట్‌గా ఉండడం వల్ల బాడీకి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కిడ్ని సమస్యలు కూడా తగ్గుతాయి. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అవయవాలు సక్రమంగా పని చేస్తాయి. అంతేకాకుండా కిడ్నీ స్టోన్ సమస్యలు తగ్గుతాయి. అయితే ఈ క్రమంలో మీరు గుర్తించుకోవాల్సింది ఏమిటంటే తప్పకుండా మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది.
3. కిడ్నీనిలకు హాని కలిగించే ఆహారాలు తినొద్దు:
ఆరోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా తింటే శరీరం బలంగా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా కూరగాయలు, తాజా పండ్లు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా బేకన్, సాసేజ్, హాట్ డాగ్‌లు, రెడ్ మీట్, బర్గర్లు, ప్యాటీలు, పిజ్జా, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం కూడా శరీరానికి ఆహానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: King Cobra Viral Video: ఒకే బిలంలో 6 కింగ్ కోబ్రాలు.. ఎంత ఈజీగా పట్టాడో! మీరే చూడండి
Also Read: Jupiter Transit 2023: బృహస్పతి సంచారం.. కొత్త ఏడాదిలో ఈ ఆరు రాశుల వారికి అంతా శుభమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook