How To Control Diabetes With Diet: రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరగడం వల్ల శరీరంలో మధుమేహం తీవ్ర రూపంగా మారుతుంది. కారణంగా చాలా రకాల ప్రాణాంతక వ్యాధులు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి కాబట్టి జీవన శైలిలో తప్పకుండా మార్పులు చేసుకోవడం వల్ల మధుమేహం నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో పోషక విలువలు కలిగిన వాటిని తీసుకుంటే మధుమేహాన్ని సులభంగా నియంత్రించవచ్చు. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన ప్రకారం ప్రతిరోజు షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవడానికి ఆహారంలో డైట్లు పాటించి..వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా పురాణాల ప్రకారం వస్తున్న ఆయుర్వేద చిట్కాలను పాటించి కూడా మధుమేహానికి చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేద మూలికలైన దాల్చిన చెక్క వివిధ మూలికలతో సులభంగా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు.
వీటితో శాశ్వతంగా మధుమేహానికి బైబై చెప్పండి:
దాల్చిన చెక్క:
దాల్చిన చెక్కను ఎక్కువగా అందరూ బిర్యానీలో వినియోగిస్తుంటారు. ఇది బిర్యానీ రుచిని రెట్టింపు చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. నోటిని రుచిని పెంచడమే కాకుండా రక్తంలోని చక్కర పరిమాణాలను కూడా సులభంగా తగ్గిస్తుంది.
పసుపు:
ఇది అందరి ఇళ్లల్లో సులభంగా లభిస్తుంది. అంతేకాకుండా మార్కెట్లో దీనిని తక్కువ ధరకే విక్రయిస్తారు. అయితే దీనిని క్రమం తప్పకుండా వినియోగిస్తే రక్తంలోని చక్కెర పరిమాణాలు సులభంగా తగ్గుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పరిమాణం అధికంగా ఉంటుంది కాబట్టి శరీర బరువును కూడా తగ్గుతారు.
కరివేపాకు:
కరివేపాకును కొందరు తినేందుకు ఇష్టపడరు. కానీ ఇది శరీరానికి చాలా మంచిది.. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారికి ఔషధంలా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా కరివేపాకును ఆహారాల్లో వినియోగిస్తే శరీరంలో ప్రోటీన్లు ప్రోటీన్ల పరిమాణం పెరుగుతుంది.
కలబంద:
చర్మ, జుట్టు సమస్యలను అధిగమించే ఔషధాల్లో కలబంద కూడా ఒకటి. చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు దీనిని క్రమంగా వినియోగిస్తే సులభంగా సమస్యలన్నీ దూరమవుతాయి. అంతేకాకుండా మధుమేహంతో బాధపడుతున్న వారు కూడా దీనిని వినియోగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: India Chokers: టీమిండియాను చోకర్స్ అని పిలవడంలో తప్పేమీ లేదు.. కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు!
Also Read: Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ జోడో యాత్రలో విషాదం.. ఇద్దరిని ఢీకొట్టిన ట్రక్.. ఒకరు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook