మహిళా లోకానికి ఆదర్శనీయం 'కమలా దాస్ జీవితం'

కమలా సురయ్య భారతదేశపు ఆంగ్లకవి, కేరళకు చెందిన మళయాళ భాష రచయిత్రి.

Last Updated : Feb 22, 2018, 03:35 PM IST
మహిళా లోకానికి ఆదర్శనీయం 'కమలా దాస్ జీవితం'

కమలా సురయ్య భారతదేశపు ఆంగ్లకవి, కేరళకు చెందిన మళయాళ భాష రచయిత్రి. ఆమె మహిళలకు చేసిన కృషికిగాను  ఫిబ్రవరి 1, 2018న గూగుల్ కమలా బొమ్మతో డూడుల్ ని ప్రచురించింది. ఈ గూగుల్ డూడుల్ ను రూపొందించిన కళాకారుడు మంజిత్ తాప్.

కమలా మార్చి 31,1934న జన్మించారు. పుట్టినప్పుడు తల్లితండ్రులు పెట్టిన పేరు కమలా. ఆమె మాధవి కుట్టి, కమలాదాస్ పేర్లతో చాలా ప్రసిద్ధి చెందారు. కమలాదాస్ చిన్న కథలు,  స్వీయ చరిత్రలు రచించేవారు. మహిళల సమస్యలు, పిల్లల సంరక్షణ, ఇతరులతో సహా వివిధ అంశాలపై కాలమ్స్ వ్రాసేవారు. లైంగిక వివక్షకు సంబంధించి నిష్పక్షపాతంగా తన రచనలను ప్రచురించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. కమలా ఆమె తరానికి ఒక ఐకాన్ గా గుర్తించబడింది. హిందూ కుటుంబంలో జన్మించిన కమలా తన 65వ ఏట డిసెంబర్ 11,1999  ఇస్లాం మతాన్ని స్వీకరించి 'కమలా సురయ్య' గా పేరు మార్చుకున్నారు. 75వ ఏట 31మే, 2009న పూణేలోని ఒక ఆసుపత్రిలో మరణించారు కమలా సురయ్య.

అవార్డులు:

2006లో యునివర్సిటీ ఆఫ్ కాలికట్ 'డాక్టర్ ఆఫ్ లెటర్స్' తో గౌరవం

ముత్తాతు వార్కీ అవార్డు- 2006

 

Trending News