Biotin Rich Foods For Strong Hair: బయోటిన్ వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. చర్మానికి జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది.. ఇది జుట్టు మందంగా దృఢంగా పెరిగేలా ప్రేరేపిస్తుంది. అయితే బయోటిన్ ఉండే సప్లిమెంట్ మాత్రమే కాకుండా కొన్ని రకాల ఆహారాల్లో కూడా బయట పుష్కలంగా ఉంటుంది. వీటిని ప్రతి రోజు మీ డైట్ లో ఉంచుకుంటే జుట్టు మందంగా పెరుగుతూనే ఉంటుంది.
కొవ్వు చేప..
కొవ్వు చేపలో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో బయోటిన్ కూడా ఉంటుంది .వీటిని డైట్ లో చేర్చుకుంటే మీ జుట్టు ఆరోగ్యంగా, అందంగా పెరుగుతుంది. జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇవి హెయిర్ పోలికల్స్ డ్యామేజ్ కాకుండా బలంగా మారుస్తాయి. దీంతో మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
గుడ్లు..
గుడ్లు కూడా బయోటిన్ కి పవర్ హౌస్ ఇందులో మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ ,మినరల్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ డి కూడా ఉంటుంది. గుడ్లను ప్రతిరోజూ మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల బయోటిని బూస్టింగ్ ఇస్తుంది. దీంతో మీ చుట్టూ ఆరోగ్యంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గుడ్డు పచ్చసొనలో ఈ బయోటిన్ ఉండటం వల్ల జుట్టు చర్మానికి మేలు చేస్తుంది
చిలగడదుంప..
చిలగడ దుంప రుచికరంగా ఉండటమే కాకుండా ఇందులో బయోటిన్ కలిగి ఉంటుంది. చిలకడ దుంపలు మీ డైలీ డైట్ లో చేర్చుకుంటే మీ జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ముఖ్యంగా జుట్టు సమస్య రాకుండా నివారిస్తుంది. చిలగడ దుంప ని ఉడకబెట్టుకొని నేరుగా తినవచ్చు.
పాలకూర..
ఆకుకూరలు జుట్టు, చర్మం, కళ్లకు మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అయితే పాలకూరలో బయోటిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరం కావాల్సిన ఖనిజాలు కూడా కలిగి ఉంటుంది. పాలకూరను డైట్ లో తీసుకోవడం వల్ల హెయిర్ ఫాలికల్స్ మంచి పోషణ అందిస్తూ జుట్టును ఆరోగ్యంగా పెరిగేలా ప్రేరేపిస్తుంది. ఇది కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
చికెన్..
ఇక చికెన్ లో లీన్ ప్రోటీన్ ఉంటుంది. అంటే ఇందులో బయోటిన్ కూడా కలిగి ఉంటుంది. చికెన్ డైట్ లో చేర్చుకోవడం వల్ల హెయిర్ ఫాలికల్స్ కి మంచి పోషణ అందిస్తూ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.
ఇదీ చదవండి: ఉసిరి.. బ్లూబెర్రీ మీ చర్మానికి రెట్టింపు అందాన్ని ఇచ్చే పండు ఏది?
గింజలు..
కొన్ని రకాల గింజలు విత్తనాలు మన డైట్ లో చేర్చుకోవాలి. ఇక ఈ సీజన్లో ముఖ్యంగా ఇమ్యూనిటీ స్థాయిలు బలంగా ఉండాలంటే గింజలు డైట్లో చేర్చుకోవాల్సిందే. నానబెట్టిన గింజలను ఉదయం తీసుకోవాలి. అయితే జుట్టు ఆరోగ్యానికి కూడా ఈ గింజలు ఎంత అవసరం. ముఖ్యంగా బాదం, వాల్నట్స్, పొద్దుతిరుగుడు గింజలు తీసుకోవడం వల్ల మంచి బయోటిని అందుతుంది. ఖనిజాలు పుష్కలంగా ఉండే ఈ గింజలు మన శరీర ఆరోగ్యానికి కాదు జుట్టు కూడా మేలు చేస్తుంది.
మష్రూమ్స్..
మష్రూమ్స్ లో కూడా బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన డైట్ లో చేర్చుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.. మష్రూమ్స్ జుట్టు బలంగా, పొడుగ్గా పెరిగేలా ప్రేరేపిస్తుంది. దీంతో మనం వివిధ వంటలు తయారు చేసుకోవచ్చు. సూపర్ మార్కెట్లో మష్రూమ్ ఏ సీజన్లో అయిన అందుబాటులో ఉంటుంది కాబట్టి మష్రూమ్ తప్పకుండా మీ డైట్ లో చేర్చుకోండి .
ఇదీ చదవండి: అనుకున్నంత పని అయింది.. దాసు ప్రాణాలు తీయాలని తలపగులగొట్టిన జ్యోత్స్న.. ఆసుపత్రిలో శౌర్య సీరియస్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.