Benefits with Aloe Vera: మన ఇంటి వెనుక లేదా మన పెరటిలో ఎక్కువగా అలోవెరా మొక్కలను పెంచుతాము. ఇవి చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. చాలా మంది దీని ఫేస్ క్రీమలుల్లో కూడా ఉపయోగిస్తారని మనకు తెలిసిందే. అయితే ఈ మొక్క కేవలం అందంకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల శరీరానికి కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
అలోవెరాలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. దీని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. దీని చర్మంపై ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మం మాయిశ్చరైజర్ అవుతుంది. అలాగే మొటిమలు, మచ్చలు, కాలిన గాయాలు తొలిగిపోతాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతకాలంలో చాలా మంది జుట్టు రాలే సమస్యలతో బాధపడుతున్నారు. దీని కోసం కూడా అలోవెరా ఎంతో ఉపయోగపడతుంది. ఇందులో ఉండే కొన్ని పోషకాలు జుట్టుకు కండిషర్‌గా పని చేస్తాయి. దీని వల్ల చుండ్రు తొలుగుతుంది.
అలోవెరా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఇది గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇది అల్సర్స్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ (IBD) వంటి జీర్ణవ్యవస్థ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కూడా అలోవెరా సహాయపడుతుంది. ఇది హానికరమైన జబ్బుల నుంచి రక్షిస్తుంది. అంతేకాకుండా అలోవెరాలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీలంలోని వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
అలోవెరాను ఎలా ఉపయోగించాలి:
అలోవెరా జ్యూస్‌ను ఇంటి వద్ద తయారు చేసుకోవడం చాలా సులభం. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచిది కాకుండా, శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలిగిస్తుంది.
అవసరమైనవి:
తాజా అలోవెరా ఆకులు
ఒక కత్తి
ఒక గిన్నె
ఒక బ్లెండర్
తేనె
నిమ్మరసం
తయారీ విధానం:
అలోవెరా ఆకులను శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఆకుల పైభాగంలోని పసుపు రంగు తొక్కను కత్తి సహాయంతో జాగ్రత్తగా తీయండి. ఆకు లోపలి భాగంలో ఉన్న పారదర్శక జెల్‌ను తీసి గిన్నెలో వేయండి. జెల్‌ను బ్లెండర్‌లో వేసి మిక్సీ చేయండి. జ్యూస్‌ను మరింత రుచికరంగా చేయాలనుకుంటే, కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలపవచ్చు.
ఈ విధంగా అలోవెరా జ్యూస్ ఆరోగ్యానికి సహాయపడుతుంది కాబట్టి మీరు కూడా ప్రతిరోజు దీని తీసుకోవడం మంచిది. పిల్లలు, పెద్దలు దీని తాగడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
Also Read: Weight Loss Upma Recipe: శరీర బరువును తగ్గించే బ్రౌన్ ఉప్మా.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook