దక్షిణాదిలో ఫలిస్తున్న మోడీ వ్యూహం

Last Updated : Nov 9, 2017, 10:47 AM IST
దక్షిణాదిలో ఫలిస్తున్న మోడీ వ్యూహం

దక్షిణాదిలో ప్రభావం చూపాలనే లక్ష్యంతో మోడీ అమలు చేస్తున్న ప్లాన్ ఫలించినట్లు కనిపిస్తోంది. ఒకవైపు ఏపీలో టీడీపీతో బంధుత్వం కొనసాగిస్తూనే మరోవైపు వైసీపీ విషయంలో విమర్శలు చేయకుండా న్యూట్రల్ గా ఉండటం..తెలంగాణలో కూడా తన ప్రాబల్యం పెంచుకుంటూనే కేసీఆర్ తో బీజేపీ నేతలు తచ్ లో ఉంటున్న విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం.

 తమిళనాడులో కూడా మోడీ తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఫార్మూలానే అమలు చేస్తున్నారు..  ఓ వైపు అన్నాడీఎంకేతో మంచిగా ఉంటూనే డీఎంకేతో సన్నిహితంగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం చెన్నై వెళ్లిన మోడీ డీఎంకే అధినేత కరుణ ఇంటికి వెళ్లి అనారోగ్యంతో ఉన్న ఆయన్ను పరామర్శించారు. 

 "మీరు ఢిల్లీ వచ్చి నా అధికార నివాసంలో ఉంటారా? నా ఇంట్లో రెస్ట్ తీసుకుంటారా?" అంటూ కరుణను మోడీ అడిగారు. మోదీ మాటకు కరుణ చిరునవ్వు నవ్వారు. ఇదే సమయంలో కరుణ భార్య దయాళు అమ్మాళ్ ను కూడా మోదీ పరామర్శించారు. కరుణ కుమారుడు స్టాలిన్ చేయిపట్టుకుని నడుస్తూ, పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో కరుణ కుమార్తె కనిమొళి కూడా అక్కడే ఉన్నారు.

ప్రధాని మోడీ... కరుణానిధిని పరామర్శించిన మరసటి రోజే నోట్ల రద్దు పై ప్రతిపక్షాలతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలనుకున్న డీఎంకే సడన్ గా మనసు మార్చుకుంది. ఇందతా మోడీ పర్యటన ప్రభావమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు.. ఈ వ్యవహారమంతా బీజేపీ రాజకీయ భవిష్యత్ అవసరాలను తెలియజేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దక్షిణాదిలో బలపడాలన్న వ్యూహంతో బీజేపీ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరుణనిధిను మారామర్శించేందుకు స్వయంగా వెళ్లడం ఇలాంటి సంకేతాలనే ఇస్తోంది. 

Trending News