Lok Sabha Polls: లోక్‌సభ ఎన్నికల వేళ తమిళనాడులో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈసారి ఎలాగైనా ప్రభావం చూపించాలని భావిస్తున్న కమలం పార్టీకి అక్కడి తమిళ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక అక్కడి అధికార డీఎంకే పార్టీ అత్యధిక స్థానాల గెలుపే లక్ష్యంగా భారీ వ్యూహ రచన చేస్తోంది. ఆ పార్టీ యువ నాయకుడు, సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ముమ్మర ప్రచారం చేస్తున్నాడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ లక్ష్యంగా ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు చేస్తూ కేంద్ర వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు.
Also Read: Ex Minister KTR: లోక్‌సభ ఎన్నికల తరువాత బీజేపీలోకి రేవంత్ రెడ్డి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తాజాగా తిరువణ్ణామలై జిల్లాలో మంగళవారం జరిగిన పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'నరేంద్ర మోదీని, బీజేపీని ఇంటికి పంపించే దాకా మా పార్టీ నిద్రపోదు' అని ప్రకటించారు. ఇటీవల మార్చి 11వ తేదీన తమిళనాడు పర్యటనలో మోదీ చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్పందిస్తూ 'డీఎంకే నాయకులకు నిద్ర రావడం లేదని ప్రధాని అంటున్నారు. నిజమే మాకు నిద్ర రావడం లేదు. బీజేపీని, మోదీని ఇంఇకి పంపించే దాకా మేం నిద్రపోము. 2014లో గ్యాస్ సిలిండర్ రూ.450, ఇప్పుడు రూ.1,200 పెరగ్గా ఇటీవల మోదీ దానిని రూ.వంద తగ్గించి డ్రామా ఆడారు. ఎన్నికల తర్వాత మోదీ మళ్లీ గ్యాస్ ధరను మళ్లీ రూ.500 పెంచుతాడు' అని తెలిపారు.
Also Read: Delhi Liquor Scam: కడిగిన ముత్యంలా బయటికి వస్తా.. కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత..
గతేడాది మిచౌంగ్ తుఫానుతో రాష్ట్రం అల్లాడిపోతుంటే నాడు ప్రధాని మోదీ కనిపించలేదు. సహాయం అందించాలని సీఎం స్టాలిన్ కేంద్రానికి లేఖ రాశారు. కానీ ఇప్పటివరకు కేంద్రం నుంచి రూపాయి కూడా రాలేదు. మోదీ చేస్తున్న మోసాన్ని రానున్న 22 రోజుల్లో పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వివరిస్తారు. డీఎంకే విజయానికి కృషి చేస్తాం. పాండిచ్చేరి, తమిళనాడులో జూన్ 3వ తేదీన పార్టీ 40 స్థానాలు గెలిచి పార్టీ అధినేత కరుణానిధి శత జయంతికి బహుమానం ఇస్తాం' అని ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook