Operation Ganga: రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్ధుల తరలింపు కొనసాగుతోంది. అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య పెద్ద ఎత్తున విమానాలతో తరలిస్తున్నారు. విద్యార్ధుల తరలింపుపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కీలకమైన అప్డేట్ ఇచ్చారు.
ఫిబ్రవరి 24న ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ ఇవాళ మీడియా ముందు కంటతడి పెడుతూ..ప్రపంచదేశాలు నోరు విప్పాలని కోరారు. తమ దేశం విషయంలో రష్యా చేసిన పనిని ప్రపంచానికి చెప్పాలని కోరారు. ఈ యుద్ధం కారణంగా ఆ దేశంలో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయ విద్యార్ధుల్ని క్షేమంగా తరలించేందుకు భారతదేశం రంగంలో దిగింది. ఆపరేషన్ గంగాతో పెద్దఎత్తున విమానాలు మొహరించింది. ఉక్రెయిన్ దేశం గగనతలాన్ని మూసివేయడంతో..రొమేనియా, పోలండ్ హంగేరీ, స్లోవేకియా దేశాల ద్వారా భారతీయ విద్యార్ధులు, పౌరుల్ని తరలిస్తున్నారు. ఈ తరలింపుకు సంబంధించి కీలకమైన అప్డేట్స్ కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు.
ఇప్పటివరకూ ఉక్రెయిన్ నుంచి 76 విమానాల ద్వారా 15 వేల 920 మంది విద్యార్ధుల్ని తరలించినట్టు మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. రొమేనియా నుంచి 6 వేల 680మంది విద్యార్ధుల్ని 31 విమానాల ద్వారా, హంగేరీ నుంచి 5 వేల 3 వందలమందిని 26 విమానాల ద్వారా, పోలండ్ నుంచి 2 వేల 822 మంది విద్యార్ధుల్ని 13 విమానాల ద్వారా, స్లోవేకియా నుంచి 1118 మంది విద్యార్ధుల్ని 6 విమానాల ద్వారా తరలించారు. ఇంకా ఈ తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆ దేశంలో చిక్కుకున్న అందర్నీ క్షేమంగా వెనక్కి రప్పించేవరకూ ఆపరేషన్ గంగ కొనసాగుతుందన్నారు.
Also read: Russia Ukraine War: నన్ను ప్రాణాలతో చూడటం ఇదే చివరిసారి కావొచ్చు.. జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook