69వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఢిల్లీలోని రాజపథ్ వేదికగా 10 దక్షిణాసియా దేశాల నుండి ముఖ్యఅతిధులుగా వస్తున్న ఆయా దేశాల ప్రధానులను మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే తొలిసారిగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రధాన శకటంగా ఆల్ ఇండియా రేడియో పరేడ్‌లో ముందువరుసలో పాల్గొంటోంది. రిపబ్లిక్ వేడుకల సందర్భంగా దేశ రాజధానిలో భారీ భద్రతా ఏర్పాట్లను చేస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో ఈ గణతంత్ర దినోత్సవ ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం
69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత నావికా దళం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ విక్రాంత్ విన్యాసాలను ప్రదర్శించనుంది. అలాగే డీఆర్డీఓ ఆధ్వర్యంలో నిర్భయ పేరు మీద లాంచ్ చేసిన మిసైల్‌తో పాటు అశ్వినీ రాడార్ సిస్టమ్‌ను ప్రదర్శనకు ఉంచనున్నారు. వీటితో పాటు మూడు టీ 90 ట్యాంకులు, 2 బ్రహ్మోస్ మిసైల్స్, 2 ఆకాష్ మిసైల్స్‌ను కూడా పరేడ్‌లో భాగంగా ప్రదర్శించనున్నారు
అలాగే బీఎస్ఎఫ్ జవాన్లు ఒంటెలతో చేసే ప్రదర్శన, అలాగే 61వ కవల్రీ ఆధ్వర్యంలో 51 గుర్రాలతో చేసే ప్రదర్శన రిపబ్లిక్ డే వేడుకలలో ప్రత్యేకం.
అదేవిధంగా ఎంఐ 17, రుద్ర హెలికాప్టర్లను కూడా ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్టులతో పాటు ప్రదర్శించనున్నారు. వీటితో పాటు అయిదు ఎంఐ 17 వీ5 హెలికాప్టర్లు జాతీయ జెండాను తీసుకెళ్లే సన్నివేశం ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుందనడంలో సందేహం లేదు. ఈసారి దక్షిణాసియా దేశాల జెండాలన్నీ కూడా ఈ వేడుకలో ప్రదర్శించనున్నారు.
69వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తొలిసారిగా మహిళా బీఎస్ఎఫ్ జవాన్లు మోటార్ సైకిల్స్‌లతో పరేడ్‌లో విన్యాసాలు చేయనున్నారు.
ఈ సారి ప్రత్యేక శకటంగా పరేడ్ గ్రౌండ్లో బరిలోకి దిగుతున్న ఆల్ ఇండియా రేడియో తమ ప్రదర్శనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ "మన్ కీ బాత్" కార్యక్రమంపై కూడా ప్రజెంటేషన్ ఇవ్వనుంది
ఈసారి రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా దాదాపు 1500 పోలీసులను పరేడ్ గ్రౌండ్ వద్ద మోహరించినట్లు సమాచారం. అదేవిధంగా ఢిల్లీ నగరం మొత్తం 60,000 మంది పోలీసులు రక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
We recall the ideals embodied in our #Constitution of JUSTICE, LIBERTY, EQUALITY and FRATERNITY for all citizens and wish you a very Happy #RepublicDay pic.twitter.com/Ksyw3Y1Skx
— Congress (@INCIndia) January 26, 2018
#RepublicDay greetings to Indians across the world. On this day, let us take pride in the achievements of our Nation and reaffirm our commitment to contribute towards building a #NewIndia, a #PositiveIndia. pic.twitter.com/RIRyzDGTlE
— Smriti Z Irani (@smritiirani) January 26, 2018
On the eve of our 69th Republic Day, I'm writing this #LettertotheNation, to remind ourselves of the commitments we made in our Constitution.
I wish each of you a very Happy Republic Day!
Jai Hind. pic.twitter.com/VaJ3WOeBqx
— Office of RG (@OfficeOfRG) January 25, 2018
समस्त देशवासियों को 69वें गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं। pic.twitter.com/vKrWzJLSt8
— BJP (@BJP4India) January 26, 2018
सभी देशवासियों को गणतंत्र दिवस की बहुत-बहुत शुभकामनाएं। Greetings on #RepublicDay. Jai Hind!
— Narendra Modi (@narendramodi) January 26, 2018
Rashtrapati Bhavan lit up on the eve of #RepublicDay pic.twitter.com/YrnwextwkT
— ANI (@ANI) January 25, 2018